Vaccinate All School Teachers by
September 5, Health Minister Urges States
సెప్టెంబర్ 5లోపు
టీచర్లకు టీకాలు ఇవ్వండి - రాష్ట్రాలకు సూచించిన కేంద్రం
సెప్టెంబర్ 5వ తేదీలోపు అన్ని రాష్ట్రాల్లోని పాఠశాల టీచర్లకు టీకాలు ఇవ్వాలని నేడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ కోరారు. ఇందు కోసం రాష్ట్రాలకు అదనంగా రెండు కోట్ల టీకాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. టీకాల కార్యక్రమంలో వారికి ప్రాధాన్యమిచ్చి టీచర్స్ డే కంటే ముందే లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. ‘‘ప్రస్తుతం ప్రతి రాష్ట్రానికి మరిన్ని డోసులు అందుబాటులో ఉంచేందుకు అదనంగా 2 కోట్ల టీకాలను తీసుకొచ్చాం. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి టీచర్లందరికీ టీకాలు ఇవ్వాలని రాష్ట్రాలను కోరుతున్నాను’’ అని ఆయన ట్వీట్ చశారు.
గతేడాది మార్చిలో దేశ వ్యాప్తంగా
పాఠశాలలను మూసివేశారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్
విధించారు. గత అక్టోబర్ తర్వాత కొవిడ్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని చాలా
రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలను తెరిచాయి. కానీ, సెకండ్ వేవ్
విజృంభించడంతో మళ్లీ మూసివేశారు. తాజాగా మరోసారి వివిధ రాష్ట్రాలు పాఠశాలలను
తెరిచే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. కానీ, చాలా చోట్ల
సిబ్బందికి టీకాలు ఇవ్వకపోవడంతో కొవిడ్ ప్రబలే ముప్పు తలెత్తింది. ఈ నేపథ్యంలో
కేంద్రం అదనపు డోసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
इस महीने हर राज्य को वैक्सीन उपलब्ध करवाने की योजना के अतिरिक्त 2 करोड़ से ज़्यादा वैक्सीन की डोज़ उपलब्ध कराई जा रही हैं।
— Mansukh Mandaviya (@mansukhmandviya) August 25, 2021
हमने सभी राज्यों से अनुरोध किया है कि 5 सितंबर को मनाये जाने वाले शिक्षक दिवस से पहले सभी स्कूली शिक्षकों को प्राथमिकता देकर वैक्सीन लगाने का प्रयास करें।
0 Komentar