Zoom App Adds a Focus Mode to Its Video
Calling App: How to Enable It
జూమ్ యాప్: ఫోకస్ మోడ్’ పేరుతో కొత్త
ఫీచర్ – విద్యార్థుల ఏకాగ్రత కు ఉపయోగం – వివరాలు ఇవే
కరోనా పరిస్థితుల కారణంగా వీడియో కాలింగ్ యాప్‌లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. బోర్డు సమావేశాల నుంచి విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన వరకూ అన్నీ ఆన్‌లైన్‌లోనే. దీంతో జూమ్, గూగుల్ డ్యుయో వంటి వీడియో కాలింగ్ యాప్‌లు ఉపయోగించే వారి సంఖ్య పెరిగిపోయింది. యూజర్స్ కోసం సదరు యాప్‌లు కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను తీసుకొచ్చాయి. తాజాగా జూమ్ యాప్ విద్యార్థులకు కోసం కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ‘ఫోకస్ మోడ్’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ ద్వారా విద్యార్థులు శ్రద్ధగా ఆన్‌లైన్ క్లాసులు వినడమే కాకుండా తోటి విద్యార్థుల కారణంగా వారి ఏకాగ్రతకు భంగం కలగకుండా సాయపడుతుందని జూమ్ పేర్కొంది.
దాంతోపాటు టీచర్ అనుమతి లేకుండా
విద్యార్థులు షేర్ చేసే వీడియోలు, స్క్రీన్ షేర్లను ఇది కనిపించకుండా
చేస్తుంది. దానివల్ల విద్యార్థులు ఇతర అంశాలపై దృష్టి మర్చలకుండా టీచర్ చెప్పే
పాఠ్యాంశాలను ఏకాగ్రతతో వింటారని జూమ్ తెలిపింది. టీచర్స్ కూడా తమ విద్యార్థులు ఏం
చేస్తున్నారని, ఎలాంటి అంశాలు షేర్ చేస్తున్నారనేది
చూడొచ్చు. అలానే టీచర్ ఫోకస్ మోడ్ డిసేబుల్ చేస్తేనే విద్యార్థులు ఒకరితో ఒకరు
మాట్లాడుకోగలరు. ఏదైనా అంశం గురించి చర్చ జరిగేటప్పుడు ఈ ఆప్షన్‌ను టీచర్
ఉపయోగించవచ్చు. టీచర్ ఫోకస్ మోడ్ డిసేబుల్ చేసేవరకూ విద్యార్థులు తమ తోటి వారికి
కనిపించరు. కేవలం టీచర్‌ని మాత్రమే చూడటంతోపాటు తమ సొంత వీడియోలు, ఇతర విద్యార్థుల పేర్లు, వారి స్పందనలు చూడగలరు. అన్‌మ్యూట్
చేస్తే తోటి వారి ఆడియోని వినగలరు.
You asked for it. 😎
— Zoom (@Zoom) August 11, 2021
Focus Mode 🔍 The perfect way for the host and co-hosts to view all participants’ videos without other participants seeing each other. https://t.co/fObYBR3yID pic.twitter.com/M3PN3hI0Qj
‘‘విద్యార్థుల కోసం తీసుకొచ్చిన ఈ ఫోకస్ మోడ్‌ని కార్పొరేట్ సంస్థలు కూడా ఉపయోగించుకోవచ్చు. దీని ప్రధాన ఉద్దేశం విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండటం. ఒకవేళ ఆఫీస్ సమావేశాల్లో ఏదైనా ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు తోటి ఉద్యోగులు ఇతర అంశాలపై దృష్టి మరల్చకుండా ఉండేందుకు ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు’’ అని జూమ్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ఫీచర్ కోసం విండోస్, మ్యాక్ యూజర్స్ జూమ్ డెస్క్‌టాప్ 5.7.3 వెర్షన్ ఉపయోగిస్తుండాలి. జూమ్ సమావేశం నిర్వహించేవారు తమ ఖాతాల నుంచి ఈ ఫోకస్ మోడ్‌ని గ్రూపులోని సభ్యులు లేదా తమకు నచ్చిన యూజర్స్‌కి మాత్రమే ఎనేబుల్ చెయ్యొచ్చు. ఆన్‌లైన్ క్లాస్ మొదలైన తర్వాత వీడియో స్క్రీన్ల కింద మోర్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే స్టార్ట్ ఫోకస్ మోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ కొద్ది మంది యూజర్స్‌కి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే యూజర్స్ అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని జూమ్ తెలిపింది.
0 Komentar