AP
Covid-19 Media Bulletin 03-09-2021
ఏపీలో
కొత్తగా 1,520 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో
గడిచిన 24 గంటల్లో 64,739 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 1,520 కేసులు
నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,18,200 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల పది మంది ప్రాణాలు
కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,887కి
చేరింది.
24 గంటల వ్యవధిలో 1,290 మంది బాధితులు కోలుకోవడంతో
రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,89,391 కి
చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,922 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,68,09,774 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
0 Komentar