AP
Covid-19 Media Bulletin 09-09-2021
ఏపీలో
కొత్తగా 1,439 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో
కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 62,856 మంది నమూనాలు పరీక్షించగా 1,439 కొత్త కేసులు నమోదయ్యాయి. 14 మంది మృతి చెందారు.
కరోనా నుంచి నిన్న 1,311 మంది కోలుకున్నారు.
రాష్ట్రంలో
ప్రస్తుతం 14,624 యాక్టివ్ కేసులు
ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్లో తెలిపింది. కొవిడ్ వల్ల కృష్ణాలో నలుగురు,
చిత్తూరులో ముగ్గురు, ప్రకాశంలో ఇద్దరు,
పశ్చిమ గోదావరిలో ఇద్దరు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మృతి
చెందారు.
0 Komentar