AP
Covid-19 Media Bulletin 30-09-2021
ఏపీలో
కొత్తగా 1,010 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో
గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 58,054 పరీక్షలు నిర్వహించగా.. 1,010 కేసులు నిర్ధారణ
అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,50,324 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 13 మంది మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14,176కి చేరింది.
24 గంటల వ్యవధిలో 1,149 మంది బాధితులు కోలుకోవడంతో
రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,24,645కి
చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,503 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,82,93,704 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
0 Komentar