AP: UPLOADING OF GOVERNMENT ORDERS ON apegazette.cgg.gov.in.
ఇకపై ‘ఏపీ ఈ-గెజిట్’ ద్వారా ప్రభుత్వ జీవోలు - ఉత్తర్వులు జారీ
UPLOADING OF GOVERNMENT ORDERS ON
apegazette.cgg.gov.in.
G.415 Dated: 13/09/2021
[G.O.Ms No. 100, General Administration
(Cabinet.II), 7th September, 2021.]
No.487 AMARAVATI, MONDAY, SEPTEMBER 13,
2021 G.415
ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు
తిరిగి అందుబాటులో ఉంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ‘ఏపీ ఈ-గెజిట్’ ద్వారా
వీటిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
జీవో ఐఆర్ వెబ్‌సైట్‌ను
నిలిపివేసినందున సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలగకుండా వివరాలను ఈ-గెజిట్‌లో
ఉంచనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రజలకు అవసరం లేని వ్యక్తిగతమైన సమాచారం, తక్కువ
మొత్తంలోని ఖర్చులు, అధికారుల సెలవులు, గోప్యంగా ఉంచాల్సిన ఇతర అంశాలను అందులో అందుబాటులో ఉంచబోమని స్పష్టం
చేసింది.
ఇకపై అన్ని జీవోలు అధీకృత అధికారి
డిజిటల్ సంతకంతో అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.
Government Orders – AP e-Gazette –
Uploading of Government Orders on apegazette.cgg.gov.in – Orders - Issued
G.O.Ms No.100 Dated:07-09-2021
0 Komentar