ఏపి: ఉన్నత విద్యా సంస్థలకు ఉమ్మడి అకడమిక్ కేలండర్‌ను విడుదల చేసిన ప్రభుత్వం – డిగ్రీ, పీజీ, బీ టెక్ కేలండర్ వివరాలు ఇవే
అన్ని ఉన్నత విద్యా సంస్థలను అక్టోబరు ఒకటి నుంచి పునఃప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఉమ్మడి అకడమిక్ కేలండర్‌ను విడుదల చేసింది. వారానికి ఆరు రోజులు తరగతులు జరగనున్నాయి. ఏదైనా కారణంతో ఒక రోజు తరగతులు జరగకపోతే వాటిని రెండో శనివారం, ఆదివారం, ఇతర సెలవుల్లో నిర్వహించాల్సి ఉంటుంది. అన్ని కోర్సులకు 2022-23 అకడమిక్ సంవత్సరం ఆగస్టు 9న నుంచి పునఃప్రారంభ కానుంది. ఉన్నత విద్యా సంస్థల్లో 50శాతం మందికి నేరుగా, మరో 50శాతం మందికి ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తారు. మూడు నెలల తర్వాత ఆన్‌లైన్ విద్యార్థులు ఆఫ్‌లైన్‌కు వస్తారు. భౌతికదూరం పాటిస్తూ వసతి గృహాలను నిర్వహించాల్సి ఉంటుంది.
బీ టెక్, బీ ఫార్మసీ కోర్సులకు తరగతులు
* సెమిస్టర్-1,3,5,7:
అక్టోబరు 1
* సెమిస్టర్-3 పరీక్షలు: జనవరి 24
* 1,5,7 ముగింపు పరీక్షలు:
ఫిబ్రవరి 7
* సెమిస్టర్-2,6,8 పునః ప్రారంభం: మార్చి1
* ముగింపు పరీక్షలు: జూన్ 23
* నాలుగో సెమిస్టర్
ప్రారంభం: ఫిబ్రవరి 15
* పరీక్షలు: జూన్1
(నాలుగో సెమిస్టర్ తర్వాత
కమ్యూనిటీ సర్వీసు ప్రాజెక్టుకు 8వారాల సమయం)
డిగ్రీ, పీజీ
కళాశాలల్లో తరగతులు
నాన్ ప్రొఫెషనల్ కోర్సుల
క్యాలెండర్ ఇలా (బేసి సెమిస్టర్లు)
► కాలేజీల
రీ ఓపెనింగ్: అక్టోబర్ 1, 2021
► 1, 3, 5 సెమిస్టర్ల తరగతులు: అక్టోబర్ 1 నుంచి
► 1, 3, 5, సెమిస్టర్ ఇంటర్నల్ పరీక్షలు: డిసెంబర్ 1 నుంచి
డిసెంబర్ 6 వరకు
► తరగతుల
ముగింపు: జనవరి 22, 2022
► సెమిస్టర్
పరీక్షల ప్రారంభం: జనవరి 24 నుంచి
నాన్ ప్రొఫెషనల్ కోర్సులు (సరి
సెమిస్టర్లు)
► 2, 4, 6 సెమిస్టర్ల తరగతుల ప్రారంభం: ఫిబ్రవరి 15, 2022
► అంతర్గత
పరీక్షలు: ఏప్రిల్ 4 నుంచి 9 వరకు
► తరగతుల
ముగింపు: మే 28, 2022
► 2, 4, 6 సెమిస్టర్ పరీక్షలు: జూన్ 1, 2022 నుంచి
► కమ్యూనిటీ
సర్వీస్ ప్రాజెక్టు: 2వ సెమిస్టర్ పరీక్షల అనంతరం 8 వారాలు
► సమ్మర్
ఇంటర్న్‌షిప్/జాబ్ ట్రైనింగ్/అప్రెంటిస్‌షిప్: 4వ
సెమిస్టర్ తరువాత 8 వారాలు
► తదుపరి
విద్యా సంవత్సరం ప్రారంభం: ఆగస్టు 9, 2022
0 Komentar