AP NMMS: పరీక్షల్లో
ఎంపికైన విద్యార్థులు తమ పేర్లను నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో నమోదు గురించి వివరాలు
ఇవే
UPDATE 16-12-2021
పత్రికా ప్రకటన 16-12-2021
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల
కార్యాలయం తేదీ. 28-02-2021 న నిర్వహించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్
పరీక్ష లో ఎంపిక అయిన విద్యార్ధులు ఈ సంవత్సరం తప్పకుండా నేషనల్ స్కాలర్షిప్
పోర్టల్ నందు తమ వివరములను నమోదు చేసుకొనుటకు మరియు నవంబరు 2017, 2018,
2019 సంవత్సరములలో ఎంపిక కాబడి, గత
సంవత్సరములలో పోర్టల్ నందు నమోదు చేసుకుని స్కాలర్షిప్ పొందిన ప్రతీ విద్యార్ధి
రెన్యువల్ చేసుకొనుటకు 31-12-2021 వరకు గడువును పొడిగించడమైనది అని జాతీయ మానవ
వనరులశాఖ వారు తెలియజేసారు. లేని యెడల వారికి ఇక ఎప్పటికీ ఏ విధంగా కూడా స్కాలర్షిప్
మంజూరు కాబడదు. పాఠశాల పరిధిలో మరియు జిల్లా విద్యాశాఖాధికారి పరిధిలో విద్యార్థుల
వివరములను ఆమోదించుటకు 15-01-2022 వరకు పొడిగించడమైనది. కావున ఎంపిక అయిన ప్రతీ
విద్యార్ధి తప్పకుండా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ (www.scholarships.gov.in)
నందు తమ వివరములను నమోదు చేసుకొని స్కాలర్షిప్ పొందగలరు. మరిన్ని
వివరములకు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయము నందు వెంటనే
సంప్రదించవలెను) అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు తెలియజేసారు.
=========================
UPDATE 04-09-2021
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్షల్లో ఎంపికైన విద్యార్థులు తమ పేర్లను నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో నమోదు చేసుకుంటేనే జాతీయ స్కాలర్‌షిప్ ఇకపై అందనుంది. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్కాలర్‌షిప్ పోర్టల్‌ను ఏర్పాటు చేసి.. అర్హులైనవారు నమోదు చేసుకుంటేనే స్కాలర్‌షిప్‌లు ఇచ్చేలా మార్పు చేసింది. పరీక్షలో మెరిట్ సాధించి ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత పోర్టల్‌లో పేరును నమోదు చేయాల్సి ఉంటుంది.
2020 సంవత్సరానికి సంబంధించి 2021
ఫిబ్రవరిలో నిర్వహించిన ఎన్‌ఎంఎంఎస్ పరీక్షల్లో ఎంపికైన విద్యార్థులంతా ఈ
సంవత్సరం తప్పనిసరిగా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ www.scholarships.gov.in
లో నవంబర్ 15 లోగా నమోదు చేసుకోవాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కొత్త నిబంధన
విధించింది. ఇలా పేరు నమోదు చేయని వారికి ఇకపై ఎప్పటికీ ఏ విధంగా స్కాలర్‌షిప్
మంజూరు కాదని స్పష్టం చేసింది. ఈ విద్యా సంవత్సరంలోని వారే కాకుండా 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఎంపికైన వారు గత సంవత్సరంలో
పోర్టల్‌లో నమోదు చేసుకుని స్కాలర్‌షిప్ పొందుతున్న ప్రతి విద్యార్థి కూడా ఈ
సంవత్సరం కూడా రెన్యువల్ కోసం తప్పనిసరిగా పేరు నమోదు చేసుకోవాలని సూచించింది.
అలా చేసుకోని వారికి రానున్న
కాలంలో స్కాలర్‌షిప్ అందదని పేర్కొంది. పాఠశాలలు/కాలేజీలు తమ విద్యార్థుల
వివరాలను డిసెంబర్ 15 లోపల ఆమోదించాలి. డీఈవోలు డిసెంబర్ 31లోగా వాటికి ఆమోదం
తెలపాల్సి ఉంటుంది. విద్యార్థులు పోర్టల్‌లో నమోదు చేసి తమ అప్లికేషన్‌ను పాఠశాల, డీఈవో
కార్యాలయాలు ఆమోదించాయో లేదో పరిశీలించుకోవాలని సూచించింది. స్కాలర్ షిప్‌లకు
సంబంధించి ఇతర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల కార్యాలయం వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in/ ను
సందర్శించవచ్చని ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు ఎ.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. డీఈవో
కార్యాలయాల్లో కూడా సంప్రదించవచ్చని తెలిపారు.
AP
NMMS FEB 2021 – Results and Selected Candidates List (District-wise)
TS:
NMMS Examination February -2021- Category wise Provisional list
0 Komentar