Atal Pension Yojana – How to Apply for APY
through SBI Net Banking
అటల్ పెన్షన్ యోజన - SBI నెట్ బ్యాంకింగ్ ద్వారా APY కోసం ఎలా దరఖాస్తు
చేయాలి?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ద్వారా 2021-22లో ఇప్పటి వరకు దాదాపు 8 లక్షల మంది కొత్త చందాదారులు అటల్ పెన్షన్ యోజన్ పథకంలో చేరారు. ఏప్రిల్ 1 నుంచి ఆగష్టు 21 మధ్య ఎస్‌బీఐ ద్వారా అత్యధికంగా 7,99,428 మంది చందాదారులు ఈ పథకంలో చేరారు.
అటల్ పెన్షన్ యోజన అర్హత..
18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు గల భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో
చేరేందుకు అర్హులు. ఇందులో ఐదు నెలవారీ స్థిర పెన్షన్ ఎంపికలు ఉంటాయి.
చందాదారులు నెలకు రూ.1000, రూ.2000, రూ.3000,
రూ.4000, రూ.5000 వరకు
మాత్రమే పెన్షన్‌గా పొందగలరు. పథకంలో చేరే సమయంలో చందాదారుడు పైన తెలిపిన వాటిలో
ఎంత మొత్తాన్ని పెన్షన్‌గా పొందాలనుకుంటున్నాడో ఎంచుకోవాల్సి ఉంటుంది. మీకు దగ్గరలో
ఉన్న ఎస్‌బీఐ శాఖను సందర్శించి గానీ, ఎస్‌బీఐ నెట్
బ్యాంకింగ్ ద్వారా గానీ అటల్ పెన్షన్ యోజన పథకానికి నమోదు చేసుకోవచ్చు.
నెట్ బ్యాంకింగ్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానం 👇
* ముందుగా ఎస్‌బీఐ నెట్‌బ్యాంకింగ్
ఖాతాకు లాగిన్ అవ్వాలి.
* ‘ఇ-సర్వీసెస్’ ఆప్షన్‌లో
అందుబాటులో ఉన్న ‘సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్’పై క్లిక్ చేస్తే కొత్త విండో ఓపెన్
అవుతుంది.
* ఇక్కడ ‘అటల్ పెన్సన్
యోజన’ను ఎంపిక చేసుకోవాలి.
* ఏపీవై అనుసంధానించే
పొదుపు ఖాతా నంబర్‌ను ఎంచుకుని సబ్మిట్ చేయాలి.
* సబ్మిట్ చేసిన తరువాత కస్టమర్
ఐడెంటిఫేకేషన్ (సీఐఎఫ్) నంబర్‌ను సెలక్ట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది.
* సిస్టమ్ జనరేట్ చేసిన
సీఐఎఫ్ నంబర్‌ను సెలక్ట్ చేయాలి.
* స్క్రీన్‌పై కనిపించే
ఇ-ఫారాన్ని పూర్తి చేయాలి.
* వ్యక్తిగత వివరాలను
పూర్తి చేసిన తర్వాత, నామినీ వివరాలను పూర్తిచేయాలి.
* పెన్షన్ మొత్తం, నెలవారీగా, త్రైమాసికంగా, వార్షికంగా
మీకు కావలసిన కాంట్రీబ్యూషన్ పిరియడ్.. మొదలైన వివరాలు ఇవ్వాలి.
* ఫారం సబ్మిట్ చేసి,
ఎక్‌నాలెడ్జ్‌మెంట్ రశీదు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్
డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏ) విడుదల చేసిన డేటా ప్రకారం ఆగస్టు 25
నాటి అటల్ పెన్షన్ యోజన చందాదారుల సంఖ్య 3.30 కోట్ల
మార్కును దాటింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా అత్యధికంగా 2.33 కోట్ల మంది, రూరల్ బ్యాంకుల ద్వారా 61.32 లక్షల మంది, ప్రైవేట్ బ్యాంకుల ద్వారా 20.64 లక్షల మంది, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకులు కలిపి 10.78 లక్షల మంది,
పోస్టల్ శాఖల ద్వారా 3.40 లక్షల మంది,
కార్పొరేట్ బ్యాంకుల ద్వారా 84,627 మంది ఈ పథకంలో
చేరినట్లు పీఎఫ్ఆర్‌డీఏ తెలిపింది.
Atal Pension Yojana subscriber count cross 3.30 cr mark; 28 lakh new additions in FY22: PFRDAhttps://t.co/vUWa5SdZ6N@FinMinIndia @DFS_India @EconomicTimes @PTI_News @TheOfficialSBI @airtelbank @pnbindia @bankofbaroda @UnionBankTweets#PFRDA #APY #pension #subscribers #Growth
— PFRDA (@PFRDAOfficial) September 2, 2021
0 Komentar