Bank Of Maharashtra Recruitment 2021:
Apply Online For 190 Vacancies in Specialist Officer (SO) Posts
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 190 స్పెషలిస్ట్ ఆఫీసర్ల ఖాళీలు
ప్రభుత్వరంగ బ్యాంకు అయిన పుణే
ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్
ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
స్పెషలిస్ట్ ఆఫీసర్లు స్కేల్ 1, 2
మొత్తం ఖాళీలు: 190
పోస్టులు: అగ్రికల్చర్ ఫీల్డ్
ఆఫీసర్,
సెక్యూరిటీ ఆఫీసర్, లా ఆఫీసర్, హెచ్ఆర్/ పర్సనల్ ఆఫీసర్, ఐటీ సపోర్ట్
అడ్మినిస్ట్రేటర్, డీబీఏ (ఎంఎస్ఎస్ క్యూఎల్/ ఒరాకిల్),
విండోస్ ఆడ్మినిస్టేటర్, ప్రొడక్ట్ సపోర్ట్
ఇంజినీర్, నెట్ వర్క్ అండ్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్,
ఈమెయిల్ అడ్మినిస్ట్రేటర్.
అర్హత: పోస్టుల్ని అనుసరించి
సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్స్ డిగ్రీ,
బీఈ/ బీటెక్/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ, పీజీ డిగ్రీ
ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్ లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ
ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షని
ఐబీపీఎస్ ద్వారా నిర్వహిస్తారు. దీన్ని మొత్తం 100 మార్కులకి
నిర్వహిస్తారు. పరీక్షా సమయం 60 నిమిషాలు ఉంటుంది. దీనికి
నెగిటివ్ మార్కింగ్ లేదు.
ప్రొఫెషనల్ నాలెడ్జ్: 50
ప్రశ్నలు -100 మార్కులు - 60 నిమిషాలు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు
చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.09.2021.
దరఖాస్తులకి చివరి తేది: 19.09.2021.
APPLY HERE (Change to LandScape Mode)
0 Komentar