Bhupendra Patel To Be the New Chief
Minister of Gujarat
గుజరాత్ నూతన సీఎంగా భూపేంద్ర పటేల్
గుజరాత్ నూతన సీఎంగా భూపేంద్ర
పటేల్ ఎంపికయ్యారు. ఇవాళ సమావేశమైన భాజపా శాసనసభా పక్షం ఈ మేరకు భూపేంద్ర పటేల్‌ను
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా
విచ్చేసిన తోమర్, ప్రహ్లాద్ జోషి సమక్షంలో సీఎం ఎంపిక
జరిగింది. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని భూపేంద్ర పటేల్
కోరనున్నారు. ప్రస్తుతం ఆయన ఘట్లోడియా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ఇప్పటి వరకు సీఎంగా ఉన్న విజయ్
రూపాణీ శనివారం గవర్నర్‌కు రాజీనామా లేఖ అందజేసిన విషయం తెలిసిందే. వచ్చే శాసనసభ
ఎన్నికల్లో భాజపాను విజయతీరాలకు చేర్చడమే లక్ష్యంగా పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి
మార్పు చేపట్టింది. సీఎం పీఠాన్ని పటేల్ సామాజిక వర్గానికి ఇవ్వాలని పార్టీ
అధిష్ఠానం నిర్ణయించడంతో పలు పేర్లు తెరపైకి వచ్చాయి. పటేల్ సామాజిక వర్గానికే
చెందిన నితిన్ పటేల్ పేరు బాగా ప్రచారంలోకి వచ్చినప్పటికీ భూపేంద్ర పటేల్ వైపే
పార్టీ అధిష్ఠానం మొగ్గు చూపింది.
గుజరాత్ మాజీ సీఎం, యూపీ
గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌కు సన్నిహితుడిగా భూపేంద్ర పటేల్‌కు పేరుంది. గతంలో ఆమె
పోటీ చేసిన ఘట్లోడియా నుంచే 2017లో పోటీ చేసిన ఆయన.. లక్షకు
పైగా ఓట్లతో విజయం సాధించారు. గతంలో అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి
ఛైర్మన్‌గానూ వ్యవహరించారు.
0 Komentar