Central Team Rushed to Kerala as Boy,
12, Dies of Nipah Virus Infection
కేరళలో నిఫా వైరస్ కలకలం - అధికారుల అలర్ట్
నిఫా వైరస్: కేరళలో నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ బారిన పడి 12 ఏళ్ల బాలుడు మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. గత రాత్రి తీవ్ర అస్వస్థకు గురైన బాలుడికి చికిత్స అందిస్తుండగానే ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.
బాలుడి నమూనాలను ముందే పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కి పంపారు. వాటిని విశ్లేషించిన నిపుణులు నిఫా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. బాలుడితో కాంటాక్ట్ ఉన్న వారందరినీ గుర్తించే ప్రక్రియను గత రాత్రే ప్రారంభించామని మంత్రి తెలిపారు. వారందరినీ ఐసోలేషన్‌లోకి పంపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నామన్నారు. మరోవైపు నిఫా కలకలంతో కేంద్ర ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. కేరళ ఆరోగ్య శాఖకు సహకారంగా కేంద్రం తరఫున ప్రత్యేక బృందం రాష్ట్రానికి చేరుకుంది.
కేరళలో 2018 జూన్‌లో తొలిసారి నిఫా వైరస్ వెలుగులోకి వచ్చింది. మొత్తం 23 కేసులను నిర్ధారించారు. వీరిలో కేవలం ఇద్దరు మాత్రమే కోలుకోవడం గమనార్హం.
2019లో మరోసారి ఒకరిలో వైరస్ నిర్ధారణ అయ్యింది.
అప్రమత్తమైన ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకోవడంతో ఒక్క కేసుతోనే వ్యాప్తికి
అడ్డుకట్ట పడింది.
0 Komentar