Cristiano Ronaldo Breaks Ali Daei's
Record for Most International Goals in Men's Football
రొనాల్డొ సరికొత్త ప్రపంచ రికార్డు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్
తన విన్యాసాలతో అందరినీ ఉర్రూతలూగించే క్రిస్టియానో రొనాల్డొ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ సాధించిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా 111 గోల్స్‌తో అగ్రస్థానంలో నిలిచాడు. ఐర్లాండ్‌తో జరిగిన ప్రపంచకప్ అర్హత మ్యాచులో ఈ పోర్చుగల్ స్టార్ రెండు గోల్స్ కొట్టడం గమనార్హం. దాంతో పోర్చుగల్ 2-1 తేడాతో విజయం సాధించింది.
బుధవారం జరిగిన మ్యాచులో 89వ నిమిషంలో రొనాల్డొ 110వ గోల్ నమోదు చేసి ఇరాన్ మాజీ స్ట్రైకర్ అలీ దేయి (109)ని అధిగమించాడు. ఆట మరో ఆరు నిమిషాల్లో ముగుస్తుందనగా రెండో హెడర్‌తో 111వ గోల్ అందుకున్నాడు. దాంతో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఒక దేశం తరఫున అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా చరిత్ర లిఖించాడు. 180 మ్యాచులు ఆడి రొనాల్డొ ఈ రికార్డును సాధించాడు.
‘నాకెంతో సంతోషంగా ఉంది. కేవలం ప్రపంచ రికార్డు బద్దలు కొట్టినందుకే కాదు. మేమంతా కలిసి ప్రత్యేక సందర్భాలను ఆస్వాదించాం. ఆట చివర్లో రెండు గోల్స్ చేయడం తేలిక కాదు. అందుకే జట్టు కష్టపడ్డ తీరును నేను అభినందిస్తున్నా. ఆఖరి వరకు మేం గెలుస్తామనే నమ్మాం’ అని రొనాల్డొ అన్నాడు.
ఒక జట్టు తరఫున అత్యధిక గోల్స్
చేసిన వారిలో అలీ దేయి (109), మోఖ్తర్ దహారి (89), ఫెర్నిస్ పుస్కస్ (84), గాడ్‌ఫ్రే చిటాలు (79)
రొనాల్డొ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. టీమ్‌ఇండియా సారథి సునీల్
ఛెత్రీ 74 గోల్స్‌తో 12వ స్థానంలో
నిలిచాడు.
0 Komentar