Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CTET December 2021: CTET December 2021: Results Released

 

CTET December 2021: Results Released

సీటెట్‌ డిసెంబర్ 2021: ఫలితాలు విడుదల  

=========================

UPDATE 09-03-2022

గత ఏడాది డిసెంబరు 16 నుంచి జనవరి 21 వరకు సీబీఎస్‌ఈ నిర్వహించిన సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌-సీటెట్‌ 15వ ఎడిషన్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు సంబంధించిన అభ్యర్థుల మార్క్‌షీట్లు, అర్హత సర్టిఫికెట్లను డిజీలాకర్‌లో త్వరలో అప్‌లోడ్‌ చేయనున్నట్లు సీబీఎస్‌ఈ ఒక ప్రకటనలో పేర్కొంది.

దరఖాస్తులో ఇచ్చిన మొబైల్‌ నంబర్‌ ఆధారంగా అభ్యర్థులు వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ పరీక్ష పేపర్‌-1కి 18.92 లక్షల మంది అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకోగా, 14.95 లక్షలమంది పరీక్షకు హాజరయ్యారు. 4.45 లక్షలమంది అర్హత సాధించారు. పేపర్‌-2కి 16.62 లక్షలమంది పేర్లు నమోదు చేసుకోగా, 12.78 లక్షల మంది హాజరయ్యారు. అందులో 2.20 లక్షలమంది అర్హత సాధించారు.

CLICK FOR RESULTS

PUBLIC NOTICE 09-03-2022

WEBSITE

=========================

UPDATE 02-02-2022

Last Date for Challenge of Answer Keys: 04-02-2022

PRESS NOTE

Display/challenge of answer key CTET Dec-2021 Website Page

Click here for Display/challenge of answer key CTET Dec-2021

WEBSITE

=========================

UPDATE 29-01-2022

CTET Dec-21 Question Papers Date Wise

CLICK HERE

=========================

UPDATE 24-01-2022

DOWNLOAD QUESTION PAPERS WITH RESPONSES

WEBSITE

=========================

UPDATE 11-01-2022

వాయిదా పడ్డ సీటెట్‌ పరీక్షలు జనవరి 17, 21 తేదీల్లో నిర్వహణ

సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీటెట్‌) గత ఏడాది డిసెంబర్‌ 16, 17 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సిబిఎస్‌ఇ) వాయిదా వేసింది. గతేడాది జరగాల్సిన పరీక్షలను ఈ ఏడాది నిర్వహించనున్నట్లు తాజాగా సిబిఎస్‌ఇ సవరించిన తేదీలను ప్రకటించింది. బోర్డు జారీ చేసిన నోటీసు ప్రకారం, డిసెంబర్‌ 16, 2021న షెడ్యూల్‌ చేయబడిన రెండవ పేపర్‌ జనవరి 17, 2022న నిర్వహించబడుతుందని సిబిఎస్‌ఇ వెల్లడించింది. అయితే డిసెంబర్‌ 17న నిర్వహించాల్సివున్న రెండు పేపర్లు, రెండు షిప్టులుగా.. జనవరి 21న నిర్వహించబడతాయని పేర్కొంది. అభ్యర్థులు అధికారిక సిటిఇటి వెబ్‌సైట్‌ నుండి సవరించిన అడ్మిట్‌ కార్డులను తీసుకోవాలని సూచించింది.

PRESS NOTE

DOWNLOAD ADMIT CARD

WEBSITE

========================

UPDATE 16-12-2021

సర్వర్‌ సమస్యలతో రద్దయిన రెండు రోజుల సీటెట్‌ పరీక్షలు - వివరాలు ఇవే

దేశవ్యాప్తంగా గురువారం (Dec 16) మధ్యాహ్నం జరగాల్సిన కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(సీటెట్‌) పేపర్‌-2 రద్దు అయింది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు జరగాల్సి ఉండగా అభ్యర్థులు ఆన్‌లైన్‌ పరీక్షలు రాసేందుకు పరీక్షా కేంద్రాలకు వెళ్లారు. తీరా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పరీక్షను రద్దు చేస్తున్నట్లు సీబీఎస్‌ఈ ప్రకటించింది. రద్దు చేసిన పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని, పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తామని తెలిపింది.

NOTICE ON 16-12-2021

ORIGINAL SCHEDULE

WEBSITE

======================

UPDATE 12-12-2021

DOWNLOAD ADMIT CARD LINK 1

DOWNLOAD ADMIT CARD LINK 2

WEBSITE

======================

NOTIFICATION DETAILS

ఈ ఏడాదికి  సీటెట్  ప‌రీక్ష ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హిస్తున్న‌ట్టు సి‌బి‌ఎస్‌ఈ  తెలిపింది. ఇందుకు సంబంధించిన  నోటిఫికేష‌న్‌లో సెప్టెంబర్ 20 విడుదల అయ్యింది.  దర‌ఖాస్తుల‌ను సెప్టెంబ‌ర్ 20, 2021 నుంచి ప్రారంభించారు. ఈ ఏడాది సీటెట్ ను 16 డిసెంబర్ 2021 నుంచి 13 జనవరి 2022 వరకు నిర్వహిస్తారు.  పరీక్ష దేశవ్యాప్తంగా 20 భాషల్లో జరుగుతుంది. పరీక్ష(Exam), సిలబస్(Syllabus), అర్హత ప్రమాణాలు, పరీక్ష ఫీజు, పరీక్ష నగరం, ముఖ్యమైన తేదీలు మొదలైన సమగ్ర సమాచారం ctet.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 

ముఖ్య‌మైన తేదీలు..

నోటిఫికేషన్ విడుదల: సెప్టెంబర్ 20, 2021

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 20, 2021

దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 19, 2021,  అక్టోబర్ 25, 2021 

ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: అక్టోబర్ 20, 2021,  అక్టోబర్ 26, 2021 

అడ్మిట్ కార్డుల విడుదల: డిసెంబర్ మొదటి వారం

పరీక్ష తేదీలు: డిసెంబర్ 16, 2021 నుంచి జనవరి 13, 2022 వరకు

 

సీటెట్ వల్ల ఉపయోగాలు

సీటెట్‌లో క్వాలిఫై అయినవారు దేశవ్యాప్తంగా పాఠశాలల్లో టీచర్ జాబ్ కోసం ప్రయత్నించవచ్చు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్-KVS, నవోదయ విద్యాలయ సమితి-NVS, ఆర్మీ స్కూల్, ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్-DSSSB, ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-ERDO లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఉద్యోగాలు పొందొచ్చు.


ఎవ‌రు రాయొచ్చు సీటెట్‌..

ఎగ్జామ్ పేపర్- 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థుల(Students)కు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్- 1 రాయాలి. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్ -2 రాయాలి. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్ -1, పేపర్ 2 రాయాల్సి ఉంటుంది. 

పేపర్ 1 విద్యార్హత- పేపర్ -1 రాయాలనుకునే అభ్యర్థులు 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ఉండాలి. లేదా 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి. లేదా 12వ తరగతి పాస్ కావడంతో పాటు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (Diploma In Education) చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి.

పేపర్ 2 విద్యార్హత- డిగ్రీతో పాటు రెండేళ్లు ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాస్ కావాలి లేదా చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి. డిగ్రీతో పాటు ఏడాది బీఈడీ చదవాలి. 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి. 

NOTIFICATION

NOTICE 18-10-2021

APPLY HERE

PRESS NOTE

MOCK TEST PAGE

SCHEDULE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags