E-Books Apps: పుస్తకాలు ఇష్టపడే
వారికి ఉపయోగకరమైన ఈ-బుక్ యాప్స్
ఇంతకుముందు తరం ఎక్కువగా పేపర్, పుస్తక
పఠనంపై ఆస్తకి చూపేవారు. ఇప్పటికీ వాటిని
చదివేవారు అధికంగా ఉన్నప్పటికీ గతంతో పోలిస్తే సంఖ్య మాత్రం తక్కువనే చెప్పొచ్చు.
ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే చదివేసే నవతరం యువత కోసం పెద్ద సంస్థలు ఎన్నో యాప్‌లను
అందుబాటులోకి తీసుకొచ్చాయి. స్వదేశ రచయితల పుస్తకాలతోపాటు ఇతర దేశాలకు చెందిన
బుక్స్‌ను వీటిల్లో సులువుగా చదివేయచ్చు.
1. అల్డికో (Aldiko)
ఈ-రీడింగ్ ప్లాట్‌ఫామ్‌లో అల్డికో
ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు. ఈ-బుక్‌ను కొనుగోలు చేసే సమయంలో చాలా ఆప్షన్స్‌ను
చూపిస్తుంది. అందులో అత్యుత్తమ ధరకే పుస్తకాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ-బుక్
షెల్ఫ్‌ను మీకు అనువుగా ఉంచుకునే వెసులుబాటును ఈ యాప్ కల్పించింది. యాప్‌లో ఫ్రీ
వెర్షన్‌తోపాటు ప్రీమియం వెర్షన్ ఉంది.
2. Amazon ఆడిబుల్ (Audible)
ఆడిబుల్ స్పెషాలిటీ ఏంటో పేరులోనే
ఉంది. కొందరు కొంత సమయం చదవడానికి ఇష్టపడతారు. కాసేపు ఎవరైనా వినిపిస్తే బాగుణ్ను
కదా అనిపిస్తుంటుంది. అలాంటి వారి కోసం ఆడిబుల్ యాప్ చక్కగా సరిపోతుంది.
ఈ-బుక్స్‌ను ఆడియోల రూపంలో వినేందుకు Audible యాప్‌లో అవకాశం
ఉంటుంది
3. Amazon కిండిల్ (Kindle)
కిండిల్ బహుశా eReaders ప్రపంచంలో బాగా తెలిసిన పేరు. అమెజాన్ అభిమానుల కోసం మిలియన్ల కొద్దీ
అద్భుతమైన పుస్తకాలు, వార్తాపత్రికలు మరియు మ్యాగజైన్‌లకు అందుబాటులో
ఉన్నాయి.
4. స్క్రెబ్‌డ్ (Scribd)
అన్ని జోనర్ల పుస్తకాలు దొరికే
ప్రాంతం స్క్రెబ్‌డ్ యాప్. పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని రకాల బుక్స్
అందుబాటులో ఉంటాయి. క్రైమ్, రొమాన్స్, చరిత్ర,
రాజకీయాలు, సైన్స్ వంటి ఇతర పుస్తకాలను
చదువుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లోనూ ఈ-పుస్తకాలను డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది.
5. కోబో బుక్స్ (Kobo Books)
ఈ-బుక్స్, ఆర్టికల్స్,
ఆడియో బుక్స్ వంటివి దాదాపు 50 లక్షల టైటిల్స్‌తో
కోబో (kobo)యాప్ పాఠకుల కోసం సిద్ధంగా ఉంటుంది. ఎలా
కావాలంటే అలా ఇంటర్‌ఫేస్‌ను మార్పు
చేసుకునేందుకు యూజర్లకు యాప్ అవకాశం
కల్పించింది. పేజీల లేఔట్‌ను మార్పు చేసుకుని చదువుకోవచ్చు.
6. ఓవర్‌డ్రైవ్ (OverDrive)
మనం సాధారణంగా లైబ్రరీకి వెళ్లి
పుస్తకాలను కొన్ని రోజులపాటు అద్దెకు తీసుకుంటూ ఉంటాం. దాని కోసం కొంతమొత్తం
చెల్లిస్తుంటాం. అలానే ఈ-బుక్స్‌ను కూడా బాడుగకు తీసుకునే వెసులుబాటును ఓవర్‌డ్రైవ్
(Overdrive)
కల్పించింది.
ఓవర్‌డ్రైవ్ యాప్‌కు కొత్త
వెర్షన్‌తో లిబ్బే (Libby) వచ్చేసింది. అయితే ఓవర్‌డ్రైవ్ యాప్‌లో
ఉన్న ఫీచర్లు లిబ్బేలో లేనప్పటికీ.. వేగవంతంగా ఉండటంతో డిజిటల్ బ్రౌజింగ్
బాగుంటుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
7. గూగుల్ ప్లే బుక్స్
(Google Play Books)
ఆండ్రాయిడ్ యూజర్లు ఎక్కువగా
గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటారని తెలుసు. అలానే
పుస్తక ప్రియుల కోసం గూగుల్ సంస్థ గూగుల్ ప్లే బుక్స్ యాప్‌ను తీసుకొచ్చింది.
యాపిల్ బుక్స్‌కు సమానంగా గూగుల్ ప్లే
బుక్స్ మరిన్ని ఈ-పుస్తకాలను యూజర్లకు అందుబాటులో ఉంచింది. పాఠకులు పుస్తకాలను
ట్రాన్స్‌లేట్, డౌన్‌లోడ్ అవకాశం కల్పించింది.
8. ఎపిక్ యాప్ చిన్నారుల
కోసం (Epic: Kids Books)
ఎపిక్ (Epic) యాప్ ప్రత్యేకంగా చిన్నారుల కోసం రూపొందించినదే. పిల్లల నుంచి హైస్కూల్
విద్యార్థుల కోసం లక్షల పుస్తకాలను ఎపిక్‌లో ఎంచుకోవచ్చు. యూఎస్, కెనడాలోని విద్యార్థులకు ఎపిక్ యాప్ సేవలు ఉచితంగా లభిస్తుండగా...
మిగిలినవారికి 30 రోజుల ఉచిత ట్రయల్ పీరియడ్‌ను
కల్పించింది.
9. యాపిల్ బుక్స్ (Apple
Books)
తమ యూజర్ల కోసం యాపిల్ సంస్థ
తీసుకొచ్చిన యాప్ Apple Books. లైబ్రరీ అంటే పుస్తకాల సమూహం.
యాపిల్ బుక్స్ కూడా వేలాది పుస్తకాల లైబ్రరీకి సమానం. ఇందులో మరొక ప్రత్యేక
ఫీచర్ ఏమిటంటే.. బుక్స్ అమరికను నిర్వహించడం. చదవడం పూర్తైన బుక్స్, చదవాల్సిన బుక్స్, ఆడియో బుక్స్.. అంతే కాకుండా బుక్
క్లబ్స్‌లోకి జాయిన్ అయ్యే ఆప్షన్‌ను కల్పించింది.
0 Komentar