Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

US Open 2021: Emma Raducanu Makes Tennis History with US Open Final Win

 

US Open 2021: Emma Raducanu Makes Tennis History with US Open Final Win

మహిళల సింగిల్స్‌లో సంచలనం: ఇద్దరు అన్‌సీడెడ్‌ క్రీడాకారిణుల పోరులో టైటిల్‌ గెలుచుకున్న ఎమ్మా రదుకాను

యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో సంచలనం నమోదైంది. మహామహులను మట్టికరిపించి ఇద్దరు అన్‌సీడెడ్‌ క్రీడాకారిణులు బరిలోకి దిగిన ఫైనల్‌లో పోరులో 18 ఏళ్ల బ్రిటిష్‌ యువకెరటం ఎమ్మా రదుకాను చరిత్ర సృష్టించింది. మహిళల సింగిల్స్‌ టైటిల్‌ పోరులో కెనాడాకు చెందిన 19 ఏళ్ల లెలా ఫెర్నాండెజ్‌ను 6-4, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించి తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను గెలుచుకుంది.

యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకున్న తొలి క్వాలిఫైయర్‌గా రదుకాను చరిత్ర తిరగరాసింది. 150 ర్యాంక్‌లో కొనసాగుతున్న ఎమ్మా.. తనకన్నా మెరుగైన స్థానంలో కొనసాగుతున్న 73వ ర్యాంక్‌ క్రీడాకారిణి లెలా ఫెర్నాండెజ్‌ను ఓడించింది. దీంతో 44 ఏళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలుకున్న బ్రిటన్‌ మహిళగా ఘనమైన రికార్డును ఎమ్మా నెలకొల్పింది. బ్రిటన్‌ తరఫున 1977లో వర్జీనియా వేడ్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలుపొందింది. 

ఇక అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఎమ్మా మొదటి నుంచి లెలాపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఎక్కడా కూడా భారీ తప్పిదాలు చేయకుండా మొదటి సెట్‌ను 6-4 తేడాతో గెలిచింది. మొదటి సెట్‌ను గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఆడిన ఎమ్మా ఇక రెండో సెట్‌లో ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. 6-3 తేడాతో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా వరుస సెట్లలో గెలిచి తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను ఎగురేసుకుపోయింది.

ఇక ఎమ్మా టోర్నీ ఆసాంతం ఒక్క సెట్‌ కూడా కోల్పోకపోవడం విశేషం. ఈ టోర్నీలో తాను ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఒక్క సెట్‌ను కూడా కోల్పోలేదు. లో కూడా పరాజయం పొందలేదు. మొత్తం 20 సెట్లలోనూ నెగ్గడం విశేషం. ఇక టైటిల్‌ గెలిచిన ఎమ్మా 2.5 మిలయన్‌ డాలర్ల ప్రైజ్‌ మనీని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ఒక్కసారిగా ఆమె ర్యాంకు 150 నుంచి 23కు వచ్చింది. ఇక బ్రిటన్‌లో తనే నెంబర్‌ వన్‌ క్రీడాకారిణి.

Previous
Next Post »
0 Komentar

Google Tags