EPF contributions exceeding Rs 2.5 lakh?
You will now have two PF accounts
ఇకపై పీఎఫ్‌లో రెండు ఖాతాలు - వడ్డీపై పన్ను వసూలుకు వీలుగా ఏర్పాట్లు
ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్) ఇక రెండు ఖాతాలుగా ఉండనుంది. ‘పన్ను మినహాయింపు ఖాతా’, ‘పన్ను విధింపు ఖాతా’ అన్న రెండు పేర్లతో విడివిడిగా నిర్వహించనున్నారు. పీఎఫ్‌కు ఉద్యోగుల వాటా ఏడాదికి రూ.2.5 లక్షలకు మించితే ఆదాయపు పన్ను విధిస్తారు. దాన్ని వసూలు చేయడం కోసం ఈ రెండు ఖాతాలు ఉంటాయి. పీఎఫ్ నిధిలో జమ చేసిన సొమ్ముపై వచ్చిన వడ్డీ.. ఆదాయపు పన్ను పరిధిలో ఉంటే దానిని లెక్కించడానికి వీలుగా ఈ ఖాతాలు ఉండనున్నాయి. ఈ మేరకు ఆదాయపు పన్ను నిబంధనల్లో మార్పులు చేస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘సెక్షన్ 9డీ’ని పొందుపరిచింది.
ఈ కొత్త నిబంధనలు వచ్చే ఆర్థిక సంవత్సరం 2022 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 2021 మార్చి 31 నాటికి ఉన్న సొమ్మును ‘పన్ను మినహాయింపు ఖాతా’ క్లోజింగ్ అకౌంట్‌గా పరిగణిస్తారు. ఈ మొత్తంపై ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), స్వచ్ఛందంగా జమ చేసే వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్)లు కలిపి ఏటా రూ.2.5 లక్షలకు దాటితే దానిపై ఆదాయపు పన్ను వేయాలని ప్రస్తుత ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్‌లో నిబంధన తీసుకొచ్చారు. అదనపు వీపీఎఫ్‌పై వచ్చే వడ్డీకి పన్ను ఉంటుంది.
పీఎఫ్ ఖాతా సామాన్య ఉద్యోగుల కోసం ఉద్దేశించినది
కాగా, భారీ జీతాలు పొందుతున్న వారు పన్ను మినహాయింపు,
అధిక వడ్డీ కోసం అదనంగా ఉన్న తమ మిగులు సొమ్మును దీంట్లో జమ
చేస్తున్నారని భావించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. ఈ వివరాలను ఆదాయపు పన్ను
రిటర్న్సులో పొందుపరచాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే బుధవారం ఈ ఉత్తర్వులు
వచ్చాయి.
దీనిపై నంగియా అండ్ కంపెనీ
భాగస్వామి శైలేష్ కుమార్ తన అభిప్రాయం చెబుతూ పీఎఫ్ వడ్డీలపై ఆదాయపు పన్ను
వేస్తామని బడ్జెట్‌లో ప్రకటించినా దానిపై స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. ఈ నిబంధనలు
రావడంతో దానిపై ఉన్న సందిగ్ధత తొలగిందని చెప్పారు. యజమాని వాటా కూడా ఉన్న
ఉద్యోగులు రూ.2.5 లక్షలు, యజమాని వాటా లేని
ప్రభుత్వ ఉద్యోగులు రూ.5 లక్షల వరకు జమ చేసుకోవచ్చని
తెలిపారు. దానికి మించితే పన్ను చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.
0 Komentar