Education Minister Asks Central
Universities' VCs to fill Up 6,000 Vacant Posts
కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 6 వేల
పోస్టుల భర్తీకి కేంద్ర మంత్రి ఆదేశం – నూతన విద్యా విధానంలో మాతృభాషతో పాటు కనీసం
ఒక విదేశీ భాష
కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో నియామకాల సందడి నెలకొనబోతోంది. ఖాళీగా ఉన్న పోస్టులన్నిటినీ భర్తీ చేయాలని వర్సీటీల ఉపకులపతులను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. అందుకు నిర్ణీత గడువును నిర్దేశించారు. ఈ నెల 10వ తేదీకల్లా ఉద్యోగాల ప్రకటనలను వెలువరించి అక్టోబరు చివరికల్లా నియామకాల ప్రక్రియను పూర్తిచేయాలని స్పష్టం చేశారు.
సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రస్తుతం 6,229 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శుక్రవారం కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో మంత్రి ప్రసంగించారు. పూర్వవిద్యార్థుల ధార్మిక నిధి కోసం ఒక ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు చేయాలన్నారు. దేశంలోని 23 ఐఐటీల్లో పరిశ్రమలతో కలిసి నవంబరులో ఆర్ అండ్ డీ ఫెయిర్ ఏర్పాటు చేయాలని సూచించారు.
మాతృభాష, అదనంగా
ఒక విదేశీ భాష
నూతన విద్యా విధానం కింద భారతీయ
భాషలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి
ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ‘‘మన విద్యార్థులకు మాతృభాషతో పాటు కనీసం ఒక
విదేశీ భాషను నేర్చుకోవడాన్ని వ్యూహంగా, ఆర్థిక అవసరంగా అమలు
చేయాలి. విదేశీ వ్యవహారాల శాఖలో ప్రతి అధికారీ మొదటి నుంచి ఒక అదనపు భాష
నేర్చుకుంటారు. దానివల్ల ఆయా దేశాలకు వెళ్లే విద్యార్థులకు మేలు జరుగుతుంది. నూతన
విద్యావిధానాన్ని వినూత్నంగా అమలుచేసి, సమయానుకూలంగా
కోర్సుల్లో నవ్యతను తీసుకురావాల్సిన బాధ్యత యూనివర్శిటీలదే’’ అని ధర్మేంద్ర
ప్రధాన్ స్పష్టం చేశారు.
Central Universities to work on mission-mode to fill-up the 6,000 vacant posts by October, 2021- Shri Dharmendra Pradhan https://t.co/GohcPBmVbO
— PIB Education (@PIBHRD) September 3, 2021
0 Komentar