Fixed Deposit Interest Rates of Leading and
Small Finance Banks
ప్రముఖ, స్మాల్
ఫైనాన్స్ బ్యాంకుల ఎఫ్‌డీ వడ్డీ రేట్ల వివరాలు ఇవే
చాలా మంది ఇప్పటికీ కూడా బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు
చేయడం సాధారణ విషయం. సీనియర్ సిటిజన్లు, మహిళలు అధిక శాతం తమ డబ్బుని
బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్లలోనే మదుపు చేస్తారు. పేరున్న ప్రముఖ బ్యాంకుల్లో
వడ్డీ రేట్లు ప్రతీ ఏడాది తగ్గుతూనే ఉన్నాయి. అయితే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఈ బ్యాంకులు
అందించే వడ్డీ రేట్లు `ఎస్‌బీఐ, ఐసీఐసీఐ,
హెచ్‌డీఎఫ్‌సీ` బ్యాంకుల కంటే కూడా అధిక వడ్డీని
అందిస్తున్నాయి.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 6.75%, 7% వరకు కూడా అత్యధిక వడ్డీ రేటు ఇస్తున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లను
ఎంచుకునే ముందు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను సరిపోల్చుకోవాలి. గ్యారెంటీ రాబడితో
పెట్టుబడి విషయానికి వస్తే, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు
కేవలం సీనియర్ సిటిజన్లకే మాత్రమే కాకుండా, హామి ఇచ్చే
ఆదాయం కోసం ఎదురు చూస్తున్న పెట్టుబడిదారుల ఉత్పత్తులుగానే కాకుండా, తక్కువ రిస్క్ ఉన్న పెట్టుబడి సాధనాల కోసం చూస్తున్నపెట్టుబడిదారులలో
కూడా కొనసాగుతున్నాయి. పెట్టుబడిదారులు తమ డబ్బుని అత్యధిక వడ్డీ రేటును
ఇచ్చే బ్యాంకుల్లో పెట్టే అవకాశం ఇక్కడ ఉంది.
కొన్ని ప్రముఖ బ్యాంకులు, స్మాల్
ఫైనాన్స్ బ్యాంకుల 7 రోజులు నుండి 10
సంవత్సరాల కాలవ్యవధి ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు క్రింది పట్టికలో
ఉన్నాయి.
0 Komentar