Google, Apple Remove More Than 8 Lakh
Apps from App Stores – Details Here
యాప్‌స్టోర్, ప్లేస్టోర్‌లలో
8 లక్షల యాప్‌లపై నిషేధం - సెక్యూరిటి కొరకు మీ మొబైల్ లో ఈ పని చేయండి
గూగుల్ ప్లేస్టోర్ నుంచి, యాపిల్ యాప్‌స్టోర్ నుంచి సుమారు 8 లక్షల యాప్‌లపై నిషేధం విధించాయి. పిక్సలేట్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ‘హెచ్1 2021 డీలిస్టెడ్ మొబైల్ యాప్స్ రిపోర్ట్’ పేరుతో పిక్సలేట్ ఒక నివేదిక రూపొందించింది.
ఇందులో మోసపూరితమైన, హానికరమైన 8,13,000 యాప్‌ల జాబితాను పొందుపరిచింది. ఈ యాప్‌లు కెమెరా, జీపీఎస్ వంటి వాటి ద్వారా యూజర్ డేటా సేకరిస్తున్నట్లు నివేదికలో వెల్లడించారు. వీటిలో 86 శాతం యాప్‌లు 12 ఏళ్లలోపు పిల్లలే లక్ష్యంగా సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు గుర్తించామని నివేదికలో పేర్కొంది.
ఈ యాప్‌ల తొలగింపునకు ప్రధాన కారణం యాప్‌స్టోర్, ప్లేస్టోర్ భద్రతాపరమైన నిబంధనలను ఉల్లంఘిండమేనని పిక్సలేట్ తెలిపింది. నిషేధిత జాబితాను రూపొందించే ముందు ప్లేస్టోర్, యాప్‌స్టోర్‌లలో సుమారు 5 మిలియన్ యాప్‌లను విశ్లేషించినట్లు పిక్సలేట్ తెలిపింది. నివేదికలో పేర్కొన్న యాప్‌లకు సుమారు 21 మిలియన్ యూజర్ రివ్యూలు ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం నిషేధిత యాప్‌లను ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది యూజర్స్ ఉపయోగిస్తున్నట్లు పిక్సలేట్ తెలిపింది.
సెక్యూరిటి కొరకు మీ మొబైల్ లో ఈ పని చేయండి
యాపిల్ యాప్‌స్టోర్, గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్‌లను నిషేధించినప్పటికీ ఈ యాప్‌లు యూజర్ల ఫోన్లలో ఉండొచ్చని పిక్సలేట్ అభిప్రాయపడింది. యూజర్స్ వెంటనే వాటిని తమ ఫోన్లలోంచి డిలీట్ చేయాలని సూచించింది. అయితే ఈ జాబితాలో ఉన్న యాప్‌లు మీ ఫోన్‌లో ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు ప్లేస్టోర్ లేదా యాప్‌స్టోర్‌లోని వెళ్లి మీ ఫోన్‌లోని యాప్‌ల వివరాలు సరిచూసుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
మీ ఫోన్‌లో చాలా యాప్ లు ఉంటాయి. వాటిలో ఉన్న యాప్ లు ప్లేస్టోర్, యాప్‌స్టోర్‌లో ఉన్నాయో చెక్ చేయాలి. ఎందుకంటే యాప్‌స్టోర్, ప్లేస్టోర్‌లలో నిషేధించినా మీ మొబైల్ స్క్రీన్ మీద ఆ యాప్ ఉండొచ్చు. కావున మీ మొబైల్ లో ఉండే యాప్ పేరు ని యాప్‌స్టోర్, ప్లేస్టోర్‌లలో సెర్చ్ చేసి ఒకవేళ లేకపోతే వెంటనే ఆ యాప్‌ను డిలీట్ చేయమని సూచిస్తున్నారు.
Over 813,000 apps were delisted from the Apple App Store and Google Play Store in H1 2021. Join our webinar on Thursday, October 7, 2021, at 1 pm ET and discover the potential reasons and much more.
— Pixalate Inc. (@PixalateInc) September 21, 2021
Register here for free: https://t.co/5I177SxA2U
#mobile #privacy #webinar
Over 2,000 @GooglePlay Store apps with 1M+ downloads were delisted in H1 2021. Read this blog to find out the most popular apps prior to delisting from the Google Play Store.#privacy #mobile #datahttps://t.co/W2CWRg0EFe
— Pixalate Inc. (@PixalateInc) September 20, 2021
0 Komentar