Google-Backed Edtech Firm Bets on Free
Math Courses to Add Users
ఆన్‌లైన్‌లో ఉచితంగా గణిత పాఠాలు.. క్యూమ్యాథ్ కొత్త ప్రోగ్రాం!
గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ వంటి దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టిన ఆన్‌లైన్ ఎడ్యుటెక్ సంస్థ ‘క్యూమ్యాథ్’ సరికొత్త ప్రోగ్రాంతో విద్యార్థుల ముందుకు వచ్చింది. వెబ్‌సైట్‌లో ఉండే ప్రీమియం కంటెంట్‌ను సంవత్సరం పాటు ఉచితంగా అందించేందుకు సిద్ధమైంది. అయితే, అందుకోసం విద్యార్థులు మరో ఇద్దరు యూజర్లను ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా క్యూమ్యాథ్ నెలకు 299 డాలర్లు వసూలు చేస్తుంటుంది. కానీ, ఎడ్యుటెక్ రంగం భారీ వృద్ధిలో ఉన్న భారత్‌లో యూజర్లను ఆకర్షించడంలో భాగంగా ఉచిత సేవల్ని తీసుకొచ్చింది.
భారత్‌లో ఎడ్యుటెక్ సంస్థలు భారీ స్థాయిలో వృద్ధి చెందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బైజూస్ వంటి దిగ్గజ సంస్థలతో క్యూమ్యాథ్ పోటీ పడుతోంది. మరోవైపు చైనాలో ప్రభుత్వ ఆంక్షల వల్ల అక్కడి ఎడ్యుటెక్ సంస్థలు తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. దీంతో భారత్‌లోని కంపెనీలకు ప్రపంచవ్యాప్తంగా తమ సేవల్ని విస్తరించేందుకు అవకాశం ఏర్పడింది.
ఈ ఉచిత ప్రోగ్రాంపై క్యూమ్యాథ్
సీఈఓ మనన్ ఖుర్మా మాట్లాడుతూ, కొవిడ్ కారణంగా చదువుకు దూరమైన వారందరికీ గణితంలో
మంచి పునాదులు వేయడానికే ఈ ప్రోగ్రాంను తీసుకొచ్చామన్నారు. 2013లో ఆఫ్‌లైన్‌లో ప్రారంభమైన ఈ సంస్థ.. ప్రస్తుతం భారత్ సహా అమెరికా,
కెనడా, యూకేలోనూ విద్యార్థులకు చేరువైంది.
ప్రస్తుతం క్యూమ్యాథ్‌లో 10 వేల మంది ట్యూటర్లు, మూడు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. స్థానిక ప్రభుత్వాలతోనూ క్యూమ్యాథ్
ఒప్పందాలు కుదుర్చుకుంటోంది.
Everyone has the right to learn math. Keeping this in mind, we've started a movement that will make our award-winning curriculum free of cost for one year.#EdTech #MathEducation #ELearning #stemforkids #1BillionMathMindshttps://t.co/RSLEwXBhsX
— Cuemath (@Cuemath) September 7, 2021
0 Komentar