Google Drive Now Supports Offline Mode:
Here’s How You Can Access Files Offline
ఇక ఆఫ్‌లైన్‌లో కూడా గూగుల్ డ్రైవ్
సేవలు - ఎలా యాక్సెస్ చేయవచ్చో తెలుసుకోండి
గూగుల్ డ్రైవ్ సేవలను ఆన్‌లైన్‌తోపాటు
ఆఫ్‌లైన్‌లో కూడా ఉపయోగించుకోవచ్చని గూగుల్ తెలిపింది. ఈ మేరకు యూజర్స్ తమ డ్రైవ్‌లోని
పీడీఎఫ్,
ఆఫీస్ ఫైల్స్, ఫొటోలను ఇంటర్నెట్‌నెట్
కనెక్షన్ లేకున్నా యాక్సెస్ చెయ్యొచ్చని తెలిపింది. ఇందుకోసం యూజర్స్ తాము ఉపయోగించుకోవాలనుకుంటున్న ఫైల్స్‌ని ముందుగా
డ్రైవ్‌లో ఆఫ్‌లైన్ చేసి ఉంచాలని తెలిపింది.
యాప్‌లో డ్రైవ్ ఓపెన్ చేసిన తర్వాత తాము యాక్సెస్ చేయాలనుకుంటున్న ఫైల్ ఓపెన్ చేసి కుడివైపున మూడు చుక్కులపై క్లిక్ చేస్తే ఆప్షన్లతో కూడిన జాబితా కనిపిస్తుంది. అందులో ఆఫ్‌లైన్ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే సదరు ఫైల్ మీకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా ఆఫ్‌లైన్ సెక్షన్‌లో కనిపిస్తుంది.
దీనికి సంబంధించి 2019లోనే గూగుల్ ఈ ఫీచర్‌ను పరీక్షించడం ప్రారంభించింది. ఇందులో భాగంగా గూగుల్ డ్రైవ్ వెబ్ ఉపయోగిచేప్పుడు కొన్ని రకాల ఫైల్స్‌ని యాజర్స్ మార్క్ చేసుకునేందుకు అనుమతించింది. తాజాగా పూర్తి స్థాయిలో యూజర్స్‌కి ఆఫ్‌లైన్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం యూజర్స్ మ్యాక్, విండోస్ కంప్యూటర్లలో గూగుల్ డ్రైవ్ డెస్క్‌టాప్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించింది. తర్వాత డ్రైవ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సపోర్టెడ్ ఫైల్స్‌పై రైట్ క్లిక్ చేస్తే ఆఫ్‌లైన్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. తర్వాత డ్రైవ్ వెబ్ యాప్ ఓపెన్ చేస్తే అందులోని ఫైల్స్ మీకు ఆఫ్‌లైన్‌లో కనిపిస్తాయి.
ఈ ఫీచర్ గూగుల్ వర్క్‌స్పేస్
ఖాతాదారులతోపాటు క్లౌడ్ ఐడెంటిటీ ఫ్రీ, క్లౌడ్ ఐడెంటిటీ ప్రీమియమ్,
జీ సూట్ బేసిక్, జీ సూట్ బిజినెట్, సాధారణ ఖాతాదారులకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం 15జీబీ స్టోరేజ్ డేటాను ఉచితంగా అందిస్తుంది. అంతకుమించి ఎక్కువ స్టోరేజ్
కావాలనుకున్న ఖాతాదారులు నెలకు 100జీబీ స్టోరేజ్ కోసం రూ. 130 చెల్లించాల్సి ఉంటుంది. అలానే 200జీబీ స్టోరేజ్‌కి
రూ. 200, 2టీబీ స్టోరేజ్‌కి రూ. 650
చెల్లించి కొనుగోలు చేసుకోవాలి.
0 Komentar