Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Google Lens Desktop Chrome as New Integrated Image Search Tool – Details Here

 

Google Lens Desktop Chrome as New Integrated Image Search Tool – Details Here

క్రోమ్ బ్రౌజర్‌లోకి గూగుల్ లెన్స్ – ఉపయోగాలివే - ఎనేబుల్ ఇలా చేయండి

ప్రస్తుతం ఎక్కువ మంది ఉపయోగించే వెబ్‌ బ్రౌజర్లలో క్రోమ్ ముందువరుసలో ఉంటుంది. ఎప్పటికప్పుడు యూజర్‌ ప్రెండ్లీ ఫీచర్స్‌ని పరిచయం చేస్తూ ఇతర వెబ్‌ బ్రౌజింగ్‌ యాప్‌లకు గట్టి పోటినిస్తోంది. తాజాగా ఈ బ్రౌజర్‌ డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో గూగుల్ లెన్స్‌ ఫీచర్‌ని పరిచయం చేశారు. మరి గూగుల్ లెన్స్‌తో లాభాలేంటి..? ఈ ఫీచర్‌ క్రోమ్ బ్రౌజర్‌లో ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చూద్దాం. 


ఎలా ఎనేబుల్ చేయాలంటే? 

* మీ పీసీలో గూగుల్ క్రోమ్ వెబ్‌ బ్రౌజర్ ఓపెన్ చేసి chrome://flags అని టైప్ చేయాలి.

* తర్వాత ఎక్స్‌పరిమెంట్స్‌ పేరుతో వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో పైన సెర్చ్‌ ఆప్షన్ ఉంటుంది.

* అక్కడ Google Lens అని టైప్ చేస్తే సెర్చ్ యువర్‌ స్క్రీన్‌ విత్ గూగుల్ లెన్స్ అని కనిపిస్తుంది. దాని పక్కనే డిఫాల్ట్‌ అనే పేరుతో ఆప్షన్ బాక్స్‌ ఉంటుంది.

* దానిపై క్లిక్ చేస్తే మీకు మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో ఎనేబుల్డ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి కింద రీలాంచ్‌పై క్లిక్ చేస్తే మీ క్రోమ్‌ బ్రౌజర్‌లో గూగుల్‌ లెన్స్ ఎనేబుల్ అవుతుంది.

* క్రోమ్‌ స్టేబుల్ వెర్షన్ 93తోపాటు ఆపై డెస్క్‌టాప్‌ వెర్షన్లు మాత్రమే గూగుల్ లెన్స్ సపోర్ట్ చేస్తుంది.

* మీరు గూగుల్ క్రోమ్ లో ఎక్కడైనా క్లిక్ చేస్తే ఈ క్రింది విధంగా గూగుల్ లెన్స్ ఆప్షన్ ఎనేబల్ అయి ఉంటుంది.

* ఆ తర్వాత మరో క్లిక్ చేస్తే నెక్స్ట్ టాబ్ ఓపెన్ అయ్యి లెన్స్ ద్వారా మనకి కావలసిన ఫలితాలు కనబడుతాయి. 

గూగుల్ లెన్స్‌ ఉపయోగాలివే 👇👇

* గూగుల్ లెన్స్‌ చేతితో రాసుకున్న నోట్స్ నుంచి పేపర్‌ క్లిప్పింగ్‌ వరకు ఎలాంటి టెక్ట్స్‌నైనా చదివి వినిపిస్తుంది.

* ఆన్‌లైన్‌ షాపింగ్ నుంచి ఫుడ్ రేటింగ్, ట్రాన్స్‌లేషన్‌ వరకు ఎన్నో రకాల పనులలో గూగుల్ లెన్స్ మీకు సాయపడుతుంది.

* మీకు వెబ్‌ పేజీలో టెక్ట్స్ చదవడం కంటే ఎవరైనా చదివి వినిపిస్తే బావుండనిపించింది. ఇందుకోసం మీ బ్రౌజర్‌లో లెన్స్‌ ఓపెన్ చేసి దానిపై ఫ్రేమ్‌ని డ్రాగ్ చేస్తే అందులోని టెక్ట్స్‌ని చదివి వినిపిస్తుంది.

* మీకు నచ్చిన వంటకం, వస్తువులకు సంబంధించిన వివరాలు గూగుల్ లెన్స్ సాయంతో  తెలుసుకోవచ్చు. 

Previous
Next Post »
0 Komentar

Google Tags