Google One Quietly Introduces New 5TB
Storage Plan: Report
Google One Storage: గూగుల్
వన్ స్టోరేజ్ కొత్త ప్లాన్ - వివరాలు ఇవే
జీమెయిల్ యూజర్స్‌కు ఆన్‌లైన్ స్టోరేజ్ అనగానే గుర్తొచ్చేది గూగుల్ వన్ డిస్క్ స్టోరేజ్. ఫొటోలు, వీడియోలు, ఆడియో క్లిప్స్‌తోపాటు ముఖ్యమైన ఫైల్స్‌ను దీని ద్వారా ఆన్‌లైన్‌లో స్టోర్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం జీమెయిల్ యూజర్లందరికీ 15జీబీ స్టోరేజ్‌ను ఉచితంగా అందిస్తోంది గూగుల్. దీంతో పాటు 100 జీబీ (రూ. 130), 200 జీబీ (రూ. 210), 2టీబీ (రూ.650) నెలవారీ రుసుముతో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు యూజర్స్‌కు అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా మరో కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను గూగుల్ అందుబాటులోకి తీసుకురానుంది. అదే 5టీబీ స్టోరేజ్.
Current Plans in India:
US Plan on 5TB:
ప్రస్తుతం ఈ ఫీచర్ అమెరికాలోని యూజర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే అన్ని దేశాల్లో ఈ ప్లాన్‌ను గూగుల్ పరిచయం చేయనుంది. అమెరికాలో దీని నెలవారీ రుసుము 24.99 డాలర్లు. మన కరెన్సీలో సుమారు రూ.1500 నుంచి రూ. 1700 మధ్య ఉంటుందని సమాచారం. ఈ 5టీబీ ప్లాన్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న యూజర్స్‌కు గూగుల్ అదనంగా మరో ప్రయోజనాన్ని అందివ్వనుంది.
ఈ ప్లాన్
తీసుకున్న యూజర్స్ యొక్క అండ్రాయిడ్ ఫోన్లకు విపిఎన్ (VPN)
సెక్యూరిటి ఫీచర్ అదనంగా లభిస్తుంది. అయితే ఇతర ఆన్‌లైన్ స్టోరేజ్ సర్వీసులతో
పోలిస్తే గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ రుసుము ఎక్కువ అనే వాదనలు వినిపిస్తున్నాయి.
0 Komentar