Google Startups Lab to Support 10 Indian
Digital News Startups
డిజిటల్ న్యూస్ అంకురాలకు గూగుల్
సాయం
- ‘జీఎన్‌ఐ స్టార్టప్స్ ల్యాబ్ ఇండియా’ ప్రారంభం
ఇండియాలోని స్థానిక, ఒకే
సబ్జెక్ట్ జర్నలిజంతో నడిచే సంస్థల కోసం ‘జీఎన్‌ఐ స్టార్టప్స్ ల్యాబ్ ఇండియా’
యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తున్నట్లు గూగుల్ గురువారం వెల్లడించింది.
గూగుల్ న్యూస్ ఇనీషియేటివ్ (జీఎన్‌ఐ) కింద ఈ 4 నెలల
కార్యక్రమాన్ని సంస్థ రూపొందించింది. ఇందులో భాగంగా ఇంటెన్సివ్ కోచింగ్, నైపుణ్య శిక్షణ, ఇతర మద్దతు అందించడం ద్వారా స్థానిక
జర్నలిజం సంస్థలు ఆర్థికంగా నిలకడ సాధించడం కోసం ఒక మార్గాన్ని కనుగొనేందుకు సాయం
చేస్తుంది.
ఎకోస్ (అంతర్జాతీయ ఇన్నోవేషన్ ల్యాబ్), డిజిపబ్ న్యూస్ ఇండియా ఫౌండేషన్‌తో కలిసి జీఎన్‌ఐ స్టార్టప్స్ ల్యాబ్ ఇండియాను ప్రారంభించింది. స్థానిక, నిమ్న వర్గాల కోసం నాణ్యమైన వార్తల్ని అందించేందుకు ఈ కార్యక్రమం మద్దతు ఇస్తుందని గూగుల్ వెల్లడించింది. అన్ని భారతీయ భాషలకు చెందిన న్యూస్ స్టార్టప్‌లు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అక్టోబరు 18 వరకు దరఖాస్తులు స్వీకరించి, అందులో నుంచి 10 స్వతంత్ర డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్‌ను ఎంపిక చేసి మొదటి దశలో పాల్గొనడానికి అనుమతిస్తామని తెలిపింది.
📆 APPLICATION DEADLINE: 18 October 2021 at 11:59 p.m.
IST.
🙌 ACCEPTANCE: We will select 10 applicants from all
submissions to participate in the program.
📌 PARTICIPANTS ANNOUNCEMENT: 8 November 2021
✨ PROGRAM STARTS: 22 November 2021
0 Komentar