ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు -
సమాధానాలు (04-09-2021)
===========================
1. ప్రశ్న:
భార్యాభర్తలు ఇద్దరు
ఉద్యోగస్తులైనపప్పుడు, వారిలో ఎవరైనా ఒకరు మరణించిన సందర్భంలో ఆ
కుటుంబ సభ్యులలో ఒకరికి కారుణ్య నియామకం ఇస్తారా? ఏదైనా జీవో
ఉన్నదా?
జవాబు:
కారుణ్య నియామకం హక్కు కాదు.
చనిపోయిన ఉద్యోగి కుటుంబం రోడ్డున పడకుండా ఇచ్చిన Social Welfare Scheme. కుటుంబానికి ఆదాయ
మార్గాలున్నప్పుడు కారుణ్య నియామకం ఇవ్వరు.
============================
2. ప్రశ్న:
సార్ నాకు ఇంక్రిమెంట్ జనవరి నెలలో
వస్తుంది కానీ నేను 2020 అక్టోబర్ లో లీవ్ వెళ్లినాను. జూన్ 2021 నెలలో జాయిన్ అయ్యాను. ఇంక్రిమెంట్ డేట్ జనవరి లోనా? జూన్ లోనా? చెప్పండి.
జవాబు:
జనవరిలో ఇంక్రిమెంట్ తేదీన మీరు
లీవ్ లో ఉన్నారు కాబట్టి, ఆ లీవ్ నుండి జాయిన్ అయిన తర్వాత మాత్రమే,
జాయినింగ్ తేదీన వస్తుంది. మెడికల్ లీవులో వెళ్ళారు కాబట్టి,
ఈ సంవత్సరం, జూన్ లో వస్తుంది. తర్వాత జనవరికి
వస్తుంది.
=============================
3. ప్రశ్న:
నేను 10వ
తరగతి తర్వాత ఇంటర్ చదవకుండా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేశాను. తదుపరి
బి.ఎడ్ చేసి ప్రస్తుతం Sgt గా పనిచేస్తున్నాను. నాకు
పదోన్నతి ఇస్తారా? ఇవ్వరా?
జవాబు:
స్కూల్ అసిస్టెంట్ పదోన్నతికి మీకు
ఈ అర్హతలు సరిపోతాయి.
=============================
4. ప్రశ్న:
డిపార్ట్మెంట్ పరీక్షలకు హాజరయ్యే
ఉపాధ్యాయులు/ ఉద్యోగులు ఎన్నిసార్లు Onduty సౌకర్యం ఏ ఉత్తర్వుల
ప్రకారం ఉంటుంది ?
============================
జవాబు:
AP ట్రావలింగ్ రూల్స్ లో 73 ప్రకారం , F.R 9(6)(B)(iii) ప్రకారం ఒక అభ్యర్థి
డిపార్ట్ మెంట్ పరీక్షలకు హాజరగుటకు DA లేకుండా రెండుసార్లు TA
మరియు OD సౌకర్యాన్ని వినియోగించవచ్చును.
=============================
5. ప్రశ్న:
SA(Hindi) గా పనిచేయుచున్న
నేను HM Post ప్రమోషన్ కు అర్హుడనేనా ?
==============================
జవాబు:
అవును. సంబంధిత డిపార్ట్ మెంట్
టెస్టు పాస్ అయి, డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ అయితే 45 సం.లు దాటినా లేదా స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ పొందినవారు 50సం.లు వయస్సు దాటినా హెచ్.ఎం గా ప్రమోషన్ పొందడానికి అర్హులు. 10వ తరగతి తర్వాత 5 సంవత్సరములు స్టడీ ఉండాలి.
===============================
6. ప్రశ్న:
ఉద్యోగాలలో మహిళలకు రిజర్వేషన్లు
ఎలా అమలు చేస్తారు?
===============================
జవాబు:
రూల్-22A ప్రకారం అన్ని కేటగిరీలకు చెందిన రిజర్వేషన్ స్థానాలలో మహిళలు కి 33
1/2 % రిజర్వ్ చేయబడి ఉన్నది. sc/st/bc/oc కేటగిరీల
వారికి కేటాయించబడిన స్థానాలలో ఆయా కేటగిరీకి చెందిన మొదటి స్థానం, ఆ తదుపరి ప్రతి మూడవ స్థానం మహిళలకి రిజర్వ్ చేయబడింది. పై రెండు రకాల
రిజర్వేషన్లు వర్తింపజేస్తూ కమ్యూనల్ రోస్టర్ తయారు చేయబడుతుంది.
సార్ స్కూల్ అసిస్టెంట్ నుండి Headmaster ప్రమోషన్ కోసం 10+2+3 కావాల్సిందానా 10 తరువాత ఓపెన్ డిగ్రీ మరియు పీజీ వాళ్ళు (ఇంటర్ లేకుండా) అర్హులు కాలేరా?
ReplyDelete