ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు -
సమాధానాలు (05-09-2021)
◼◼◼◼◼◼◼◼◼◼
1. ❓ప్రశ్న:
నేను 13.6.16 న విధులలో చేరాను. ట్రైనింగ్ లేదు. కానీ జీతం 1.6.16 నుండి ఇచ్చారు. ఇపుడు జాయినింగ్ తేదీ గా ఏది SR లో
రాయాలి??
✅జవాబు:
జీతం 1.6.16 నుండి ఇచ్చారు కాబట్టి మీ date of జాయినింగ్ కూడా 1.6.16 అవుతుంది.
•••••••••
2. ❓ప్రశ్న:
నేను cps ఉద్యోగిని.సేవింగ్స్ 1,20,000/- ఉన్నాయి. Cps
మినహాయింపు 53,000/- ఉన్నాయి. వీటిని ఐటీ ఫారం
లో ఎలా చూపాలి??
✅జవాబు:
30,000/- వరకు 80ccd(1)
కింద, మిగిలిన 23,000/- ను
80ccd(1బి)కింద చూయించి పన్ను మినహాయింపు పొందవచ్చు.
•••••••••
3. ❓ప్రశ్న:
ఈ సంవత్సరం రెండు da లు కలపటం వల్ల నా ఆదాయం 5 లక్షలు దాటింది.20% పన్ను పరిధిలోకి వెళ్ళాను. ఆ రెండు da లు గత
సంవత్సరం ఆదాయంలో చూయించు కోవచ్చా??
✅జవాబు:
చూపించుకోవచ్చు.గత సంవత్సరం నకు
చెందిన బకాయిలను ఆయా సంవత్సరం లలో చూపి పన్ను మినహాయింపు పొందవచ్చు. అందుకోసం ఫారం
10-E
సమర్పించాలి.
•••••••••
4. ❓ప్రశ్న:
నేను ఎయిడెడ్ స్కూల్ లో స్కూల్
అసిస్టెంట్ గా ఉన్నాను.నేను HM అకౌంట్ టెస్ట్ పాస్ కాలేదు. నేను 6,12,18 ఇయర్స్ స్కేల్స్ పొందాను.నాకు 24 ఇయర్స్ స్కేల్ కి
అర్హత ఉన్నదా??
✅జవాబు:
ఉన్నది. నేరుగా స్కూల్ అసిస్టెంట్
గా నియమించబడినందున మీరు 24 ఇయర్స్ స్కేల్ పొందాలంటే రెండవ ప్రమోషన్
పోస్ట్ లేనందువలన మీకు అర్హత లతో సంబంధం లేకుండా 24 ఇయర్స్
పూర్తి కాగానే స్కేల్ మంజూరు చేయబడుతుంది.
•••••••••
5. ❓ప్రశ్న:
నేను LFL HM గా పనిచేయుచున్నాను. 6 ఇయర్స్ స్కేల్ తీసుకున్నాను.
12 ఇయర్స్ స్కేల్ పొందటానికి ఏ ఏ అర్హతలు కావాలి.నాకు ప్రస్తుతం 50 ఇయర్స్ నిండినవి.
✅జవాబు:
మీరు 12 ఇయర్స్ స్కేల్ తీసుకోవాలి అంటే డిగ్రీ,బి.ఎడ్ లతో
పాటు డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అయి ఉండాలి.మెమో.34408 తేదీ:4.2.12
ప్రకారం 50 ఇయర్స్ మినహాయింపు వర్తించదు.
0 Komentar