Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు – సమాధానాలు (09-09-2021)

 

ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు – సమాధానాలు (09-09-2021)

◼◼◼◼◼◼◼◼◼◼

1. ప్రశ్న:

నేను హైస్కూల్ లో పనిచేస్తున్నాను. పరీక్షల నిమిత్తం దాదాపు 35 రోజులు వేసవి సెలవుల్లో బడికి వచ్చాను. నాకు ఎన్ని ELs ఇస్తారు??

జవాబు:

మీరు 15 రోజుల కన్నా తక్కువ గా వేసవి సెలవులు వినియోగించుకున్నందున FR.82(డి) ప్రకారం 24 రోజులు సంపాదిత సెలవులు ఇవ్వాలి.

=========================

2. ప్రశ్న:

నేను రక్త దానం చేశాను. Spl. CL ఎవరు ఇస్తారు??

జవాబు:

జీఓ.137 తేదీ:23.2.84 ప్రకారం రక్త దానం చేస్తే CL మంజూరు చేసే అధికారే Spl. Cl కూడా మంజూరు చేస్తారు.

=========================

3. ప్రశ్న:

నేను పేరు మార్చుకోవాలని అనుకుంటున్నాను. ఐతే ఏమి చెయ్యాలి??

జవాబు:

జీఓ.102 తేదీ:24.4.1985 ప్రకారం 5రూ స్టాంపు పేపర్ మీద అఫిడవిట్ చేయించి DDO, తెలిసిన ఇద్దరితో సాక్షి సంతకాలు చేయించాలి. స్థానిక వార్తా పత్రికలలో మరియు గెజిట్ లో ప్రచురణ చేయించాలి.

===========================

4. ప్రశ్న:

నేను PF నుండి ఋణం పొందియున్నాను.

వాయిదాలు పూర్తి కాలేదు. మరలా ఋణం కావాలి. ఇస్తారా??

జవాబు:

ZPPF నిబంధనలు 14 ప్రకారం మరల ఋణం పొందవచ్చు. మిగిలి ఉన్న బకాయి,కొత్త ఋణం మొత్తం కలిపి వాయిదాలు నిర్ణయిస్తారు.

=======================

5. ప్రశ్న:

ఒక డీజేబుల్డ్ ఉపాధ్యాయునికి వృత్తి పన్ను మినహాయించాలి అంటే ఎంత శాతం అంగవైకల్యం ఉండాలి??

జవాబు:

జీఓ.1063 తేదీ:2.8.2007 ప్రకారం 40% డీజేబుల్డ్ ఉంటే వృత్తి పన్ను మినహాయింపు వర్తిస్తుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags