ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు –
సమాధానాలు (27-09-2021)
1. ప్రశ్న:
సార్, భార్య
& భర్త ఇరువురు ప్రభుత్వ ఉద్యోగులు అయి, వారిలో భర్త మరణిస్తే, అవివాహితుడు అయిన వారి
సోదరుడికీ కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వుటకు వీలుపడుతుందా?
జవాబు:
రూల్స్ ప్రకారం అలా వీలు లేదు.
చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి ఏ విధమైన ఆదాయ వనరులు లేనప్పుడు మాత్రమే కారుణ్య
నియామకం వీలుంటుంది.
=========================
2. ప్రశ్న:
సర్, ఉపాధ్యాయుల
వృత్తికి ఆటంకాలు కలిగించే లేదా దాడి చేసే వారిపై ఏవిధంగా చర్యలు తీసుకోవడానికి
ఏమైనా జీవో లేదా సర్కులర్ ఉన్నదా? తెలుపగలరు.
జవాబు:
ఏ ఉపాధ్యాయుడి పైన ఎవరైనా అసభ్యంగా
ప్రవర్తించినా విధులకు ఆటంకం కలిగించినా దాడి చేసినా IPC 186, 189, 353 ప్రకారం 2yr జైలు శిక్ష ఉంటుంది.
========================
3. ప్రశ్న:
మా ఆఫీసులో watch women గా పనిచేస్తున్న ఆవిడకు liver cancer, retirement 2030 ఇప్పుడు ఈమె voluntary retirement తీసుకుంటే ఆమె
కూతురుకి ఉద్యోగం వస్తుందా? మూడవ కూతురికి వివాహం కాలేదు. How
to process
జవాబు:
(1) ముందుగా మెడికల్ బోర్డు
ద్వారా మెడికల్ ఇన్‌వాలిడేషన్ తీసుకోవాలి.
(2) ఆ మెడికల్ ఇన్‌వాలిడేషన్
తో కారుణ్య నియామకానికి ధరఖాస్తు చేసుకోవాలి.
ఇందులో మొదటిది సాధించవచ్చు కాని
రెండవ దానికి గ్యారంటీ లేదు.
==============================
4. ప్రశ్న:
Sir ఒక టీచర్ 22 days
మెడికల్ లీవ్ లో ఉన్నాడు
23rd day జనరల్ హాలిడే
24th day సెకండ్ Saturday
25th day Sunday
ఇప్పుడు 25
రోజులకు మెడికల్ సర్టిఫికెట్ తీసుకు రావాలా?
23 రోజులకు తీసుకు రావాలా?
Prefix, suffix మెడికల్
లీవ్ లకు వర్తిస్తాయా?
GO లు తెలుపగలరు.
జవాబు:
ఈ కేసులో Fitness ఎప్పుడు పొందేరో ఇంపార్టెంట్.
(1) 22 రోజులకు Fitness
Certificate ఇస్తే, 22-రోజులకు లీవ్ మరియు 3-రోజులకు suffix చేసుకోవచ్చు. 22-రోజులు లీవ్ డిడక్ట్ అవుతుంది.
(2) 25 రోజులకు Fitness
Certificate ఇస్తే, suffix ఉండదు. 25 రోజులు లీవ్ డిడక్ట్ అవుతుంది.
FR 68; FR 71 మరియు AP
Leave Rules ను చూడండి.
0 Komentar