ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు -
సమాధానాలు (28-09-2021)
◼◼◼◼◼◼◼◼◼◼
1. ❓ప్రశ్న:
UP స్కూల్ లో పనిచేస్తున్న
టీచర్ అదే మండలం నకు FAC MEO గా భాద్యత లు నిర్వహించుచున్న
అతని వార్షిక ఇంక్రిమెంట్లు, ELs ఎవరు మంజూరు చేస్తారు??
✅జవాబు:
FR.49 ప్రకారం ఒక పోస్టులో
అదనపు బాధ్యతలు నిర్వహించుచున్న సందర్భంలో ఆ పోస్టుకి గల అన్ని అధికారాలు
సంక్రమిస్తాయి. కనుక వార్షిక ఇంక్రిమెంట్లు తనే మంజూరు చేసుకోవచ్చు. ELs మాత్రం DEO గారి ఆనుమతి తో జమ చేయవలసి ఉంటుంది.
•••••••••
2. ❓ప్రశ్న:
SGT గా పనిచేస్తున్న టీచర్ VRO
గా ఎంపిక ఐతే పే--ప్రొటెక్షన్, సర్వీస్
ప్రొటెక్షన్ ఉంటుందా??
✅జవాబు:
DEO అనుమతి తో పరీక్ష
రాస్తే వేతన రక్షణ ఉంటుంది. జీఓ.105 తేదీ:2.6.2011 ప్రకారం నూతన పోస్టు యొక్క స్కేల్ లో ప్రస్తుతం పొందుతున్న వేతనానికి
సమానమైన స్టేజి లో వేతనం నిర్ణయించబడుతుంది. ఇంక్రిమెంట్ మాత్రం నూతన సర్వీసు లో
చేరిన ఒక సంవత్సరం తర్వాతే మంజూరు చేస్తారు.
•••••••••
3. ❓ప్రశ్న:
మహిళా టీచర్ భర్త నిరుద్యోగి. అత్త, మామ
కూడా ఈమె పైనే ఆధార పడి జీవిస్తున్నారు. అత్త గారికి ఆరోగ్యం బాగా లేదు. మెడికల్
రీఅంబర్సుమెంట్ వర్తిస్తుందా??
✅జవాబు:
APIMA రూల్ 1972 ప్రకారం వర్తించదు. కేవలం మహిళా టీచర్ అమ్మ,నాన్న
లకి మాత్రమే వర్తిస్తుంది.
•••••••••
4. ❓ప్రశ్న:
నాకు మొదటి సారి అమ్మాయి.తర్వాత
కవల పిల్లలు జన్మించారు. LTC లో ముగ్గురు పిల్లలు ప్రయాణం చేయవచ్చా??
✅జవాబు:
జీఓ.140 తేదీ:3.4.96 ప్రకారం ఇద్దరు పిల్లలుకి మాత్రమే
అవకాశం ఉంది.
•••••••••
5. ❓ప్రశ్న:
అబార్షన్ కి రెండుసార్లు మాత్రమే
సెలవు ఉపయోగించుకోవాలి అనుచున్నారు. వాస్తవమా?? కాదా??
✅జవాబు:
జీఓ.254;ఆర్ధిక;తేదీ:10.11.95 ప్రకారం
ఇద్దరు కంటే తక్కువ జీవించియున్న బిడ్డలు గలవారు అర్హులు. అంతేకానీ ఎన్నోసారి అనే
దానితో నిమిత్తం లేదు.
0 Komentar