Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ప్రభుత్వ ఉపాధ్యాయుల సందేహాలు – సమాధానాలు (10-09-2021)

 

ప్రభుత్వ ఉపాధ్యాయుల సందేహాలు సమాధానాలు (10-09-2021)

◼◼◼◼◼◼◼◼◼◼

1. ప్రశ్న:

ఒక టీచర్ ఫిబ్రవరి 29న జాబ్ లో చేరాడు. అతనికి వార్షిక ఇంక్రిమెంట్ ఏ నెలలో ఇవ్వాలి??

జవాబు:

ఆర్.సి.2071 తేదీ:21.7.2010 ప్రకారం లీపు సంవత్సరం ఫిబ్రవరి 29న విధుల్లో చేరిన ఉపాధ్యాయుల వార్షిక ఇంక్రిమెంట్ ఫిబ్రవరి నెల లోనే ఇవ్వాలి.

===================

2. ప్రశ్న:

బిడ్డ పుట్టి వెంటనే మరణించిన, వారికి మెటర్నిటీ లీవు కి అర్హత ఉందా??

జవాబు:

Lds.1941 తేదీ:11.6.90 ప్రకారం మరణించిన బిడ్డను ప్రసవించినా, ప్రసూతి సెలవు వాడుకోవచ్చు.

===================

3. ప్రశ్న:

ఒక టీచర్ వైద్య కారణం లపై 3 సార్లు జీత నష్టపు సెలవు పెట్టాడు. అతని వార్షిక ఇంక్రిమెంట్ వాయిదా పడుతుందా??

జవాబు:

పడుతుంది. ఐతే CSE గారు అనుమతి మంజూరు చేస్తే,నార్మల్ ఇంక్రిమెంట్ కొనసాగే అవకాశం ఉంది.

==================

4. ప్రశ్న:

వేసవి సెలవుల్లో పాఠశాల విధులు నిర్వహించటానికి జూనియర్ అసిస్టెంట్ లేకపోతే ఎవరిని నియమించాలి??

జవాబు:

ఆ స్కూల్లో సీనియర్ ఉపాధ్యాయునికి ముందు అవకాశం ఇవ్వాలి.

===================

5. ప్రశ్న:

ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే, కారుణ్య నియామకం కింద వారుసునికి ఉద్యోగం ఇస్తారా??

జవాబు:

మెమో.41758 , తేదీ:19.7.2007 ప్రకారం ఉద్యోగం ఇస్తారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags