Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ప్రభుత్వ ఉపాధ్యాయుల సందేహాలు - సమాధానాలు

 


ప్రభుత్వ ఉపాధ్యాయుల సందేహాలు - సమాధానాలు

◼◼◼◼◼◼◼◼◼◼

1. ప్రశ్న:

సర్వీసు మొత్తం మీద ఎన్ని కమ్యూటెడ్ సెలవులు వాడుకోవాలి??

జవాబు:

సర్వీసు మొత్తం మీద 240 రోజులు కమ్యూటెడ్ సెలవుగా వాడుకోవచ్చు. అప్పుడు అర్థ జీతపు సెలవు ఖాతా నుండి 480 రోజులు తగ్గించబడతాయి. ఆ తర్వాత కూడా సెలవు అవసరం ఐతే కేవలం అర్ధ జీతపు సెలవు గా మాత్రమే ఖాతాలో నిల్వ ఉన్నంత వరకు వాడుకోవచ్చు.

•••••••••

2. ప్రశ్న:

స్కూల్ అసిస్టెంట్ తెలుగు గా పదోన్నతి పొందటానికి కావాల్సిన అర్హతలు ఏమిటి??

జవాబు:

జీఓ.15,16 తేదీ:7.2.2015 ప్రకారం డిగ్రీ లో మెయిన్ గా గానీ లేదా 3 ఆప్షనల్ సబ్జెక్టు లలో ఒక సబ్జెక్టు గా తెలుగు ఉండాలి. బి.ఈ డి లో తెలుగు methodology లేదా పండిట్ ట్రైనింగ్ కలిగి ఉండాలి. అదేవిధంగా జీఓ.28,29 తేదీ:2.7.15 ప్రకారం పీజీ అర్హత తో భాషా పండితులు గా నియమించబడిన వారు కూడా స్కూల్ అసిస్టెంట్ తెలుగు కి అర్హులే.

•••••••••

3. ప్రశ్న:

ఓపెన్ యూనివర్సిటీ SSC, ఇంటర్ పరీక్షల ఇన్విజిలేటర్ గా పనిచేసిన వారికి సంపాదిత సెలవు నమోదు కొరకు ప్రతి సంవత్సరం ఉత్తర్వులు రావాలా??

జవాబు:

అవసరం లేదు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వారి ఉత్తర్వులు ఆర్.సి.నo.362/1-1/2013 తేదీ:16.11.2013 ప్రకారం జమ చేయవచ్చు.

•••••••••

4. ప్రశ్న:

LFL HM కి 12 ఇయర్స్ స్కేల్ పొందటానికి కావలసిన అర్హతలు ఏమిటి??

జవాబు:

LFL HM కి తదుపరి పదోన్నతి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కాబట్టి డిగ్రీ, బీ. ఈ. డీ, డిపార్ట్మెంట్ పరీక్షల ఉతీర్ణత ఉండాలి.50 ఇయర్స్ వయస్సు నిండితే డిపార్ట్మెంట్ టెస్టుల మినహాయింపు వర్తిస్తుంది.

•••••••••

5. ప్రశ్న:

విదేశాలకి వెళ్లుటకు ఏ విధమైన సెలవు వాడుకోవచ్చు??

జవాబు:

విదేశాలకు వెళ్లుటకు 3 నెలల వరకు CSE, ఆ పై కాలానికి Edn. Sec నుండి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలి. అనుమతి లభించిన కాలానికి అర్హత గల(EL/HPL/EOL)ఏ సెలవు నైనా వినియోగించుకోవచ్చు. జీఓ.70 తేదీ:6.7.2009 ప్రకారం 4 నెలల లోపు HM/MEO, 4--6 నెలల వరకు Dy. EO, 6 నెలల నుండి 1 ఇయర్ వరకు DEO,1--4 ఇయర్స్ వరకు CSE,4 ఇయర్స్ పైన Edn. Sec నుండి సెలవు మంజూరు చేయించుకోవాలి.

Previous
Next Post »
0 Komentar

Google Tags