How To Make Offline UPI Payments Without
an Internet Connection?
ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఆఫ్‌లైన్
UPI
చెల్లింపులు చేయడం ఎలా?
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) - స్మార్ట్ ఫోన్ ద్వారా ఒకరి బ్యాంకు ఖాతా నుంచి, వేరొకరికి నగదు ఏ సమయంలోనైనా తక్షణమే నగదు పంపించగల సదుపాయం. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన బిహెచ్ఐఎమ్ యాప్‌తో పాటు పేటీఎమ్, ఫోన్‌పే, గూగుల్‌పే, అమెజాన్ పే వంటి ప్రైవేట్ యాప్‌లు కూడా యూపీఐ చెల్లింపు సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఇందుకుగానూ ఆయా యాప్‌లను మీ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు స్మార్ట్ ఫోన్, ఇంటర్‌నెట్ సదుపాయం కావాలి. కాని ఫీచర్డ్ ఫోన్, స్మార్ట్ ఫోన్ రెండింటిలోనూ ఇంటర్‌నెట్ సదుపాయం లేకుండా యూపిఐ చెల్లింపులు చేయవచ్చు.
*99#కి డయల్ చేయడం ద్వారా మీ సర్వీస్ మీకు లభిస్తుంది. దీనిని USSD 2.0గా కూడా పిలుస్తారు
రిజిస్టర్ చేసుకోవడం ఎలా?
* బ్యాంకులో నమోదైన
రిజిస్టర్డ్ మొబైల్ నుంచి *99# డయల్ చేసి, బ్యాంక్ ఖాతాను ఎంచుకోవాలి.
* మీ డెబిట్‌కార్డులోని చివరి
6 డిజిట్లను ఎంటర్ చేయాలి.
* ఎక్స్‌పయిరీ తేది, యూపిఎన్ పిన్ ఎంటర్ చేసి కన్ఫమ్ చేయాలి. దీని తర్వాత మీరు సేవలను ఉపయోగించకోవచ్చు.
నగదు బదిలీ చేసే విధానం..
Step 1:
మీ ఫోన్‌లో డయల్ ప్యాడ్ (dial pad) తెరిచి (*99#) అని టైప్ (type) చేయండి. ఇది మిమ్మల్ని ఏడు ఎంపికలతో కూడిన కొత్త విండోకి తీసుకెళుతుంది.
విండోలో 'డబ్బు పంపండి (Money send)', 'డబ్బును స్వీకరించండి (Money receive)', 'చెక్
బ్యాలెన్స్ (check balance)', 'నా ప్రొఫైల్ (My
profile)', 'పెండింగ్ అభ్యర్థనలు (Pending requests)', 'లావాదేవీలు (Transactions)' మరియు 'UPI పిన్ (pin)' వంటి ఎంపికల (Options) జాబితా చేస్తుంది.
Step 2:
మీరు తదుపరి చేయాల్సిందల్లా మీ
డయల్ ప్యాడ్‌పై నంబర్ 1 నొక్కడం ద్వారా 'డబ్బు
పంపండి' ఎంపికను ఎంచుకోండి. ఇది మీ ఫోన్ నంబర్, UPI
ID లేదా మీ ఖాతా నంబర్ మరియు IFSC కోడ్‌ని
ఉపయోగించి డబ్బు పంపడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
Step 3:
వివిధ రకాల చెల్లింపు పద్ధతుల్లో, మీరు
ఒకదాన్ని ఎంచుకోవాలి, మీరు ఫోన్ నంబర్ ఎంపికను ఎంచుకుంటే..
మీరు డబ్బు పంపాలనుకునే వ్యక్తి యొక్క మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. మీరు UPI
ID ఎంపికను ఎంచుకుంటే.. మీరు అవతలి వ్యక్తి యొక్క UPI ID ని నమోదు చేయాలి. బ్యాంక్ ఖాతా ఎంపికకు కూడా ఇది వర్తిస్తుంది.. ఇక్కడ IFSC
కోడ్, తరువాత లబ్ధిదారుని బ్యాంక్ ఖాతా నంబర్‌ను
నమోదు చేయాలి.
Step 4:
తర్వాత, మీరు
Google Pay లేదా Pay tm తో ఎలా చేసి
ఉంటారో అదేవిధంగా, మీరు మరొక వ్యక్తికి బదిలీ చేయదలిచిన
మొత్తాన్ని నమోదు చేయాలి.
Step 5:
చివరి దశలో మీరు మీ ఆరు లేదా
నాలుగు అంకెల UPI పిన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత 'పంపండి (Send)' బటన్ నొక్కాలి.
ఆ తర్వాత మీరు మీ ఫోన్‌లో ఒక రిఫరెన్స్ (Reference) ID తో పాటు
లావాదేవీ స్థితి అప్‌డేట్ (update)ను అందుకుంటారు. ఒకవేళ
లావాదేవీ (Transaction) విజయవంతమైతే (Successful) భవిష్యత్తు లావాదేవీల కోసం మీరు ఈ వ్యక్తిని లబ్ధిదారుడిగా సేవ్ (save)
చేయాలనుకుంటున్నారా అని మిమ్మల్ని అడుగుతారు.
0 Komentar