How to Transfer Your PF Account -
Step-by-Step Guide
ఈపీఎఫ్ ఆన్‌లైన్‌లోనే సులభంగా
బదిలీ చేసుకునే విధానం ఇదే
కార్యాలయాలు చుట్టూ తిరగకుండానే
డిజిటలైజేషన్ పుణ్యమానిచాలా పనులు ఇంటివద్దే పూర్తవుతున్నాయి. వీటిలో ఇప్పుడు
ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) కూడా చేరింది. ఇకపై ఈపీఎఫ్ ఖాతాదారులు ఉద్యోగం మారే
సమయంలో పీఎఫ్ నగదును కొత్త కంపెనీకి సులభంగా బదిలీ చేసుకోవచ్చు. ఈ మేరకు ఈపీఎఫ్‌ను
మనమే ఆన్‌లైన్‌లోనే బదిలీ చేసుకునే సదావకాశాన్ని ఈపీఎఫ్ఓ కల్పించింది. అదేలా అంటే!
1. తొలుత ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్
లోకి వెళ్లి, మీ యూఏఎన్ (Universal Account Number),
పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
2. ఆపై ‘ఆన్‌లైన్
సర్వీసెస్’లో ఖాతా బదిలీ అభ్యర్థన కోసం ‘వన్ మెంబర్-వన్ ఈపీఎఫ్ అకౌంట్’
ఎంచుకోండి.
3. తర్వాత మీ ప్రస్తుత
వ్యక్తిగత, పీఎఫ్ ఖాతా సమాచారం సరి చూసుకోండి.
4. ఇదే ఫారమ్‌లో కింద
యూఏఎన్ లేదా పాత ఈపీఎఫ్ సభ్యత్వ ఐడీని మరోసారి ఎంటర్ చేస్తే మీ ఖాతా వివరాలు
కనిసిస్తాయి.
5. తర్వాత ప్రస్తుత,
పాత సంస్థల్లో దేనికి ఖాతా బదిలీ చేయాలనుకుంటున్నారో ఎంటర్ చేసి
‘గెట్ డిటెల్స్’పై ఓటీపీ కోసం క్లిక్ చేయండి.
6. ఆపై యూఏఎన్ రిజిస్టర్
మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీనీ నమోదు చేసి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయండి.
7. ఒకసారి మీరు ఓటీపీ ఎంటర్ చేసిన
తరువాత ఆన్‌లైన్ ద్వారా బదిలీ ప్రాసెస్ అభ్యర్థన మీ సంస్థకు చేరుతుంది. ఆన్‌లైన్
సర్వేసెస్ మెనూలోని ‘ట్రాక్ క్లెయిమ్ స్టేటస్’ ఆప్షన్ ద్వారా మీ ఈపీఎఫ్
బదిలీ స్థితిని తెలుసుకోవచ్చు.
ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేసేందుకు
పాత లేదా ప్రస్తుత సంస్థకు ఫారమ్ 13ను సబ్మిట్ చేయాల్సి
ఉంటుంది.
Know how to transfer EPF online
— EPFO (@socialepfo) September 5, 2021
जानिए कैसे करें ईपीएफ ऑनलाइन ट्रांसफर#EPFO #SocialSecurity #HumHainNa pic.twitter.com/x22NiLgMgc
0 Komentar