Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IMMS APP లో MDM - ఇన్స్పెక్షన్ లో ఇమేజస్ అప్లోడ్ చేయడం లో కొన్ని సూచనలు

 

IMMS APP లో MDM - ఇన్స్పెక్షన్ లో ఇమేజస్ అప్లోడ్ చేయడం లో కొన్ని సూచనలు

 

* అందరు ప్రధానోపాధ్యాయులు కు తెలియజేయునది ఏమనగా ఇదివరకే జగనన్న గోరుముద్ద ఇన్స్పెక్షన్ లో భాగంగా ఫోటోలు తీయడం లోను అప్లోడ్ చేయడం లోను సూచనలు ఇవ్వడం జరిగింది. కానీ అనుకున్న ఫలితాలు రావడం లేదు.

* కావున ఉత్తమ ఫలితాలు సాధించుటకు, ఈ క్రింది సూచనలు పాటించవలసినదిగా ప్రధానోపాధ్యాయులును కోరడమైనది.

 

🔷️1. ఫోటోలు తీసే సమయంలో ఫుడ్ మొత్తం కవర్ అయ్యేటట్టు చేసుకోవలెను.

🔶️2. ఫోటోలు తీసే సమయంలో మన యొక్క చేతులు కాళ్ళు భాగాలు పడకుండా జాగ్రత్త పడవలెను.

🔷️3. మెనూ మొత్తం తీసే సమయంలో అప్పుడే వండిన పదార్థాలను ప్లేట్ లో కాకుండా వండిన వంట పాత్రలోనే ఉండగా ఫోటో తీసి అప్లోడ్ చేయవలెను.

🔶️4. అన్ని ఐటమ్స్ ఫోటో తీసినప్పుడు పాత్రలు నిండుగా ఉన్నప్పుడు మాత్రమే తీయవలెను.

🔷️5. ఐటమ్ వారీగా ఫోటో తీసేటప్పుడు కూడా వండిన వంట పాత్ర  లో ఉంచి తీయవలెను.

🔶️6. ఉడికించిన గ్రుడ్లు అన్ని ఒక పాత్ర లో పెట్టి ఫోటో తీయవలెను మరియు , చిక్కి లను ప్యాకింగ్ నుండి తీసి బల్క్ గా ఒక పెద్ద పాత్రలో పెట్టి మొత్తంగా  ఫోటో తీయవలెను.

🔷️7. ముఖ్యంగా కొంతమంది ప్రధానోపాధ్యాయులు ఫోటోలకు ఫోటో తీసి పెడుతున్నారు అలా చేయకూడదు.

🔶️8. ఇక నుండి అన్ని పాఠశాలలు కు సంబంధించి ఇమేజస్ *AI టెక్నాలజీ ద్వార వెరిఫై చేసి ఫుడ్ క్వాలిటీ చెక్ చేయడం జరుగుతుంది. కావున ఫుడ్ క్వాలిటీ విషయంలోను ఇమేజస్ తీయడంలోను జాగ్రత్తలు తీసుకోవాలి. 

* పై సూచనలను జగనన్న గోరుముద్ద ఇన్స్పెక్షన్ చేసే సమయంలో అందరు ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా పాటించడం వలన ఇన్స్పెక్షన్ విషయంలో ఉత్తమ ఫలితాలు పొందగలమని తెలియజేయడమైనది.

From, The Director, MDM&SS. 

Update IMMS – Mid Day Meals Android App with Latest Version

Previous
Next Post »
0 Komentar

Google Tags