IRCTC to Launch India's First Luxury
Cruise Liner from September 18
తొలి స్వదేశీ విలాస క్రూజ్ లైనర్ - ఈ నెల 18 నుంచి ప్రారంభం: ఐఆర్‌సీటీసీ
తొలి స్వదేశీ క్రూజ్ లైనర్
సేవలను ఈ నెల 18 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ రైల్వే క్యాటరింగ్
అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) బుధవారం వెల్లడించింది. వాటర్‌వేస్
లీజర్ టూరిజం కు చెందిన కార్డెలియా క్రూజెస్ అనే ప్రైవేటు కంపెనీ భాగస్వామ్యంతో
దీన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ సంస్థ దేశంలో ప్రీమియం క్రూజ్ లైనర్‌గా
ఉంది. గోవా, డయ్యు, లక్షద్వీప్,
కోచి, శ్రీలంక తదితర ప్రాంతాలకు వీటిని
నడపనుంది.
ఈ నెల 18
నుంచి తొలి దశలో ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభిస్తారు. 2022 మే తర్వాత చెన్నైకు క్రూజ్‌ను పంపించి అక్కడి నుంచి శ్రీలంక, కొలంబో, గాలే, ట్రింకోమాలీ,
జాఫ్నా తదితర ప్రాంతాలకు పర్యాటక సేవలు అందిస్తామని ఐఆర్‌సీటీసీ
పేర్కొంది. ముంబయి నుంచి లక్షద్వీప్‌నకు 5 రాత్రులు,
6 పగళ్ల ప్రయాణానికి ఒక మనిషికి రూ.49,745
నుంచి టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ‘ఐఆర్‌సీటీసీటూరిజమ్.కామ్’లో
బుకింగ్‌లు చేసుకోవచ్చని తెలిపింది.
0 Komentar