Jio Launches 20% Cashback
on Jio Recharge Plans – Details Here
Jio Cashback: జియో
రీఛార్జీతో క్యాష్‌బ్యాక్ - ప్లాన్‌ల వివరాలు ఇవే
ఫెస్టివల్ సీజన్ నేపథ్యంలో జియో సరికొత్త రీఛార్జ్ ఆఫర్‌తో ముందుకొచ్చింది. ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అయితే, మూడు ప్లాన్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. రూ.249, రూ.555, రూ.599 ప్లాన్‌లపై 20% క్యాష్‌బ్యాక్ వస్తుంది. మై జియో యాప్ లేదా జియో అధికారిక వెబ్‌సైట్ ద్వారా రీఛార్జ్ చేసిన వారికి మాత్రమే ఈ ప్రయోజనం అందనుంది. రీఛార్జ్ అనంతరం జియో ఖాతాలో క్యాష్‌బ్యాక్ జమ అవుతుంది. దీనిని భవిష్యత్తులో రీఛార్జ్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు.
రూ.249 ప్లాన్ : రోజువారీ 2GB డేటా; అపరిమిత వాయిస్ కాలింగ్; రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు; కాలపరిమితి 28 రోజులు; జియో యాప్‌లకు ఉచిత యాక్సెస్.
రూ.555 ప్లాన్: రోజువారీ 1.5GB డేటా; అపరిమిత వాయిస్ కాలింగ్; ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు; కాలపరిమితి 84 రోజులు; అన్ని జియో యాప్‌లకు ఉచిత యాక్సెస్.
రూ.599 ప్లాన్:
రోజువారీ 2GB డేటా; అపరిమిత వాయిస్
కాలింగ్; ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు;
కాలపరిమితి 84 రోజులు; అన్ని
జియో యాప్‌లకు ఉచిత యాక్సెస్.
క్యాష్‌బ్యాక్ పొందటం ఎలా..
* మైజియో యాప్ లేదా కంపెనీ
అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
* 20% క్యాష్‌బ్యాక్
రీఛార్జి సెక్షన్‌పై క్లిక్ చేయండి.
* రూ.249, రూ.555 లేదా రూ.599 నుంచి
ఏదైనా ఒక ప్లాన్‌ను ఎంచుకోండి.
* ప్లాన్ సొమ్ము
చెల్లించండి.
20% లేదా గరిష్ఠంగా 200 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. వచ్చిన క్యాష్‌బ్యాక్ సొమ్మును వినియోగదారులు
అక్టోబర్ 2 నుంచి జియో మార్ట్, స్మార్ట్
పాయింట్, రిలయన్స్ ఫ్రెష్ సిగ్నేచర్, మిల్క్‌బాస్కెట్, ట్రెండ్స్, రియలన్స్ డిజిటల్, నెట్‌మెడ్స్, జియో రీఛార్జ్, అజియోలో ఎక్కడైనా రీడీమ్
చేసుకోవచ్చు.
0 Komentar