Know How to Enable News Reading Option in
Google Clock
Google Clock: గూగుల్ క్లాక్
లో అలారంతో పాటు ఈ ఫీచర్ కూడా ఉందని మీకు తెలుసా?
ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో న్యూస్‌పేపర్‌కి బదులు ఎక్కువ మంది టీవీలో వార్తలు చూస్తున్నారు. వర్చువల్ వాయిస్ అసిస్టెంట్‌లు అందుబాటులోకి వచ్చాక న్యూస్ ప్లే చేయమని కమాండ్ ఇస్తే చాలు మనకు కావాల్సిన భాషలో న్యూస్ చదివి వినిపిస్తాయి.
అయితే
ఆండ్రాయిడ్ ఫోన్‌లోని గూగుల్ క్లాక్ (గడియారం) అప్లికేషన్ న్యూస్ హెడ్‌లైన్స్‌తో
మిమ్మల్ని నిద్రలేపుతుంది. కేవలం వార్తలు మాత్రమే కాకుండా వాతావరణ సమాచారం,
రిమైండర్, క్యాలండర్ షెడ్యూల్ వంటి పనులు
కూడా అలారం క్లాక్ చేసిపెడుతుంది. అందుకోసం మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని గూగుల్ క్లాక్
యాప్‌లో కొన్ని మార్పులు చేయాలి. మరి ఆ మార్పులేంటి?హెడ్‌లైన్స్‌తో
అలారం మిమ్మల్ని నిద్రలేపేందుకు ఏం చేయాలో చూద్దాం.
* మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ క్లాక్ అప్లికేషన్ ఓపెన్ చేసి ప్లస్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. ఉదయాన్నే మిమ్మల్ని లేపాలనుకునే టైంకి అలారం సెట్ చేయండి. తర్వాత కిందకి స్క్రోల్ చేసి గూగుల్ అసిస్టెంట్ ఫీచర్‌పై క్లిక్ చేయాలి.
* అందులో మీకు వాతావరణం, క్యాలెండర్, రిమైండర్, ప్లే న్యూస్ అని ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో ప్లే న్యూస్పై క్లిక్ చేసి సేవ్‌పై క్లిక్ చేస్తే అలారంతో మిమ్మల్ని నిద్రలేపి న్యూస్ చదవడం ప్రారంభిస్తుంది.
* అయితే ఈ ఫీచర్‌లో కేవలం
వార్తలు మాత్రమే కాకుండా సంగీతం, రేడియో, పాడ్‌కాస్ట్, ఆడియోబుక్, స్లీప్
సౌండ్స్‌ని కూడా వినొచ్చు.
* ఇందుకోసం యాప్ ఓపెన్ చేసి అలారం సెట్ చేసిన తర్వాత గూగుల్ వాయిస్ అసిస్టెంట్‌పై క్లిక్ చేస్తే మీకు ప్లే మీడియా న్యూస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి డిలీట్ చేయాలి. తర్వాత యాడ్ యాక్షన్‌పై క్లిక్ చేయాలి.
* అందులో ప్లే అండ్ కంట్రోల్ మీడియా ఆప్షన్ ఓపెన్ చేస్తే మీకు పైన పేర్కొన్న అన్ని ఫీచర్స్ కనిపిస్తాయి. వాటిలో మీకు కావాల్సిన ఫీచర్‌ను ఎంచుకుని సేవ్ చేయాలి. తర్వాత అలారం టైంకి మీరు ఎంచుకున్న ఆప్షన్ ఆధారంగా వాటిని ప్లే చేస్తుంది.
గమనిక: షావోమి, శాంసంగ్
ఫోన్లలో తమ ఓఎస్‌కి అనుకూలమైన క్లాక్ యాప్‌లను మాత్రమే ఇస్తున్నాయి. వాటిలో మీకు
గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ కనిపించదు. ఇందుకోసం మీరు గూగుల్ క్లాక్ యాప్‌ని తప్పనిసరిగా
డౌన్‌లోడ్ చేసుకోవాలి.
0 Komentar