Know The Meaning of Your PAN Card
Characters
పాన్ కార్డు నెంబర్ లోని అక్షరాల అర్దం
ఏంటో తెలుసుకుంటే మీ పాన్ నంబర్‌ను సులభంగా గుర్తుంచుకోవచ్చు
పాన్ కార్డు (శాశ్వత ఖాతా నంబర్)పై ఉన్న నంబర్ మీకు మీకు గుర్తుందా..? చాలా మందికి గుర్తుండే ఉంటుంది. కొందరు మాత్రం అవసరమొచ్చినప్పుడు కార్డును చూసుకోవడమే తప్ప గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించరు. అంకెలు, అక్షరాలతో కూడిన ఆ నంబర్‌ను గుర్తుపెట్టుకోవడం ఎందుకని పెద్దగా పట్టించుకోరు. కానీ, ఆ పది నంబర్‌ను మీకు కేటాయించడం వెనుక అసలు కారణం తెలుసుకుంటే ఇకపై మీరు ఇట్టే గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే మీకు సంబంధించిన సమాచారం కొంత అందులో దాగి ఉంటుంది కాబట్టి! ఇంతకీ మీ పాన్‌కార్డుపై ఉండే ఆ వ్యక్తిగత సమాచారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
యుటీఐ లేదా ఎన్ఎస్‌డీఎల్ ద్వారా ఒక క్రమంలో పాన్‌ను వ్యక్తులకు ఆదాయ పన్ను శాఖ జారీ చేస్తుంది. మీ మొబైల్ నంబర్ మాదిరిగా పాన్ నంబర్ కంప్యూటర్ జనరేటెడ్ నంబర్ కాదు. దాని వెనుక ఒక పరమార్థం ఉంది. పాన్ కార్డుపై 10 అంకెలు, అక్షరాలు కలిపి ఉంటాయి. మొదటి ఐదు ఆంగ్ల అక్షరాలు, తర్వాత నాలుగు అంకెలు, చివరిలో ఒక అక్షరం ఉంటుదన్నమాట!
ఒక్కోసారి ఇంగ్లీష్ అక్షరం 'O', సున్నా '0' (జీరో)కి మధ్య వ్యత్యాసాన్ని గుర్తుపట్టకపోవచ్చు.
అయితే మీకు సంఖ్యల వెనకు ఉన్న అర్థం తెలిస్తే సులభంగా గుర్తించొచ్చు.
1. పాన్‌లో మొదటి మూడు అక్షరాలు AAA to ZZZ సిరీస్‌లో ఉంటాయి.
2. నాలుగో అక్షరం ఆదాయ పన్ను శాఖ దృష్టిలో మీరు ఏంటి అనేది చెప్తుంది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులందరికీ నాలుగో అక్షరం "P" అనే ఉంటుంది.
"P" - అంటే వ్యక్తిగత
పన్ను చెల్లింపుదారుడు
"C" - అని ఉంటే
కంపెనీ
"H" - అని ఉంటే
హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్)
"A" - అంటే వ్యక్తులు
లేదా సంస్థల బృందం (అసోసియేషన్ పర్సన్స్-ఏఓపి)
"B" - వ్యక్తుల
బృందం (బిఓఐ)
"G" - ప్రభుత్వ
ఏజెన్సీ
"J" - తాత్కాలిక
న్యాయవ్యవస్థ
"L" - స్థానిక
అధికారిక కేంద్రం
"F" - సంస్థ లేదా
పరిమిత భాగస్వామ్య సంస్థ
"T" - ట్రస్ట్
3. ఇక ఐదో అక్షరం మీ ఇంటి పేరులోని మొదటి అక్షరాన్ని తెలుపుతుంది. ఉదాహరణకు మీ సర్‌నేమ్ సింగ్ అయితే Singh ఐదో అక్షరం "S" అవుతుంది. వ్యక్తులు కాకుండా ఇతరులు అయితే పాన్ కార్డు హోల్డర్ పేరులోని మొదటి అక్షరం ఉంటుంది.
4. ఆ తర్వాత నాలుగు అంకెలు 0001 నుంచి 9999 మధ్య ఉంటాయి.
5. చివరి సంఖ్య ఎప్పుడూ అక్షరమే ఉంటుంది.
పాన్ సంఖ్య వెనుక ఉన్న రహస్యం
ఏంటో తెలుసుకుంటే సులభంగా గుర్తుంచుకోవచ్చు.
0 Komentar