Domestic LPG Cylinder Costly By ₹25;
Commercial Cylinder Price Up By ₹75. Details Here
నేటి నుంచే అమల్లోకి పెరిగిన
గ్యాస్ సిలిండర్ ధర – వివరాలు ఇవే
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. రాయితీ వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.25, వాణిజ్య సిలిండర్‌పై రూ.75 పెంచారు. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. 15 రోజుల వ్యవధిలోనే గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెరగడం గమనార్హం.
తాజా పెరుగుదలతో
దిల్లీలో రాయితీ వంటగ్యాస్ ధర రూ.884.50కి, వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల సిలిండర్ ధర ₹
1,693కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ ఆధారంగా సిలిండర్ ధరల్లో మార్పులు ఉంటాయి.
అలాగే స్థానికంగా ప్రభుత్వాలు విధించే పన్నులు ప్రభావం చూపుతాయి.
0 Komentar