MCC Amends Laws of Game, To Use
Gender-Neutral Term ‘Batter’ Instead Of ‘Batsman’
ఇక నుంచి క్రికెట్ లో ‘బ్యాట్స్‌మెన్’
అనే పేరు ఉండదు – కారణం ఇదే
గల్లీ నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ప్రతి క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు ఆసక్తి చూపుతుంటారు. గత కొన్నేళ్లుగా క్రికెట్ గేమ్ ప్రపంచ దేశాలకూ పాకింది. పదేళ్ల కిందట వరకు వన్డేలు, టెస్టులదే రాజ్యం. ఇప్పుడు టీ 20 క్రికెట్‌కు ప్రజాదరణ బాగా పెరిగిపోయింది. అయితే ఇటీవల టెస్టు మ్యాచ్‌లను వీక్షించే ప్రేక్షకులూ ఎక్కువైపోయారు. ఆయా జట్ల మధ్య ఉండే పోటీతత్వం కూడిన ఆట ప్రతి క్రీడాభిమానికి ఎంతో ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. మరోవైపు పురుషుల క్రికెట్‌కు ధీటుగా మహిళల క్రికెట్‌కూ ఆదరణ పెరిగింది.
క్రికెట్‌లో ఎక్కువగా బ్యాట్స్‌మెన్, కీపర్,
బౌలర్, ఫీల్డర్.. వంటి పదాలు వినిపిస్తుంటాయి.
వాడకంలో కీపర్, బౌలర్, ఫీల్డర్
వంటివి అటు పురుషుల ఆటగాళ్లకు.. ఇటు మహిళా క్రీడాకారిణులకు సరిపోతాయి. కానీ
బ్యాట్స్‌మెన్ అంటే కేవలం పురుషులను ఉద్దేశించి పిలిచేదిగా ఉండటంతో మెరిల్‌బోన్
క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాట్స్‌మెన్ స్థానంలో
తటస్థంగా ఉండే పదాలను చేర్చేందుకు క్రికెట్ చట్టంలో పలు సవరణలు చేస్తున్నట్లు
ఎంసీసీ వెల్లడించింది.
ఇక నుంచి అధికారికంగా బ్యాట్స్‌మెన్
అనే వాటికి బదులు ‘బ్యాటర్ లేదా బ్యాటర్స్’ పదాలను ఉపయోగించాలని పేర్కొంది. ఈ
మేరకు చట్టసవరణ చేస్తున్నట్లు ఎంసీసీ ప్రకటించింది. అయితే ఇప్పటికే కొన్ని క్రీడా
సంస్థలు బ్యాటర్ లేదా బ్యాటర్స్ అనే పదాలను వాడుతున్నాయి. దీనిని మరింత
ప్రోత్సహించేలా చట్టసవరణ చేసేందుకు ఎంసీసీ నిర్ణయం తీసుకుంది. ఎలాంటి అధికారిక, అనధికారిక
గేమ్‌లోనైనా సరే ఇవే వాడాలని స్పష్టం చేసింది
MCC has today announced amendments to the Laws of Cricket to use the gender-neutral terms “batter” and “batters”, rather than “batsman” or “batsmen”.
— Marylebone Cricket Club (@MCCOfficial) September 22, 2021
0 Komentar