New SBI Pension Seva Portal: Submit Life
Certificates at Any Branch, Check Other Facilities Here
పెన్షనర్లకు ఎస్‌బీఐ శుభవార్త - ఇక
ఏ బ్రాంచ్‌లోనైనా లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించే వీలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పింఛన్‌దారులకు శుభవార్త చెప్పింది. పెన్షనర్లు ఇకపై ఏదైనా ఎస్‌బీఐ బ్రాంచ్ వద్ద లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించే వీలు కల్పించింది. పెన్షనర్లకు ఉద్దేశించిన పెన్షన్ సేవా పోర్టల్ పునరుద్ధరణలో భాగంగా ఈ సదుపాయం తీసుకొచ్చింది. పెన్షన్‌కు సంబంధించిన వివరాలను సులువుగా పొందే వెసులుబాటును కల్పించామని ఎస్‌బీఐ వెల్లడించింది.
ఎస్‌బీఐ సేవా పోర్టల్ అందించే
సేవలు
* పెన్షనర్లు ఎస్‌బీఐ
పెన్షన్ సేవా పోర్టల్ ద్వారా వారి పెన్షన్ స్లిప్/ ఫారం-16ని
డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
* సీనియర్ సిటిజన్స్ వారి
పెన్షన్ లావాదేవీల వివరాలను చూడొచ్చు.
* ఎరియర్స్ బ్యాలన్స్ షీట్
డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
* కస్టమర్స్ తమ లైఫ్
సర్టిఫికెట్ స్థితిని తెలుసుకోవచ్చు.
* పెన్షనర్లు తమ పెన్షన్
ప్రొఫైల్ వివరాలను కూడా సులభంగా చూడొచ్చు.
కొత్తగా అందుబాటులోకి వచ్చిన సేవలు
* పెన్షన్ చెల్లింపు
వివరాలతో పెన్షనర్ల మొబైల్ ఫోన్లకు ఎస్‌బీఐ సందేశాలను పంపుతుంది.
* మీరు మీ పెన్షన్
స్లిప్పును ఈ-మెయిల్/ పెన్షన్ చెల్లింపు శాఖ ద్వారా పొందొచ్చు.
* జీవన్ ప్రమాణ్ సౌకర్యం
బ్యాంకు శాఖల్లో అందుబాటులో ఉంటుంది.
* పెన్షనర్లు ఎస్‌బీఐకి
చెందిన ఏదైనా బ్యాంక్ శాఖలో లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించొచ్చు.
ఫిర్యాదుల కోసం..
1. పెన్షన్ సంబంధిత
సేవల్లో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను support.pensionseva@sbi.co.in కి ఈ-మెయిల్ పంపొచ్చు. లేదా UNHAPPY అని 80082
02020కి ఎస్సెమ్మెస్ చేయొచ్చు.
2. 24x7 కస్టమర్‌కేర్
సర్వీస్ ద్వారా 1800 425 3800/1800 112 211 టోల్‌ఫ్రీ
నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.
3. ఈమెయిల్ అడ్రస్‌లు customer@sbi.co.in / gm.customer@sbi.co.in కు
మెయిల్ చేయొచ్చు.
Good news for all Pensioners!
— State Bank of India (@TheOfficialSBI) September 20, 2021
We have revamped our PensionSeva website for you to manage all your pension related services with ease.
Click here: https://t.co/pM0XAgtzuc#PensionSeva #Pension #SBI pic.twitter.com/sQZOENF0cg
0 Komentar