Ola Electric: Scooter Sales Started – Details
Here
ఓలా` ఎలక్ట్రిక్ స్కూటర్
అమ్మకాలు మొదలు – ముఖ్యమైన వివరాలు ఇవే
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు
ప్రారంభం అయ్యాయి. ఓలా స్కూటర్ బుకింగ్ పూర్తి చేయడానికి కొన్ని సూచనలు క్రింద ఇవ్వబడ్డాయి.
స్కూటర్‌ని రిజర్వ్ చేసుకున్న కస్టమర్‌లు మిగిలిన మొత్తాన్ని చెల్లించి
దానిని కొనుగోలుగా మార్చుకోవచ్చు. కస్టమర్ల కోసం, కొనుగోళ్ల
కోసం అధికారిక వెబ్‌సైట్‌ను రూపొందించడంలో సాంకేతిక ఇబ్బందుల కారణంగా కంపెనీ తన
అమ్మకాలను వారం పాటు వాయిదా వేసింది. ఇపుడు స్కూటర్‌ని రిజర్వ్ చేసుకున్న ఓలా
కస్టమర్లు మిగిలిన మొత్తాన్ని చెల్లించి కొనుగోలు చేయవచ్చు. వాహన వేరియంట్,
రంగు ఎంపికలను ఖరారు చేసుకోవచ్చు.
ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ ట్విట్టర్‌లో స్కూటర్ అమ్మకాలను ప్రారంభించినట్లు తెలియచేశారు. ఓలా ఎస్1 కొనుగోలు ఇపుడు అందుబాటులోకి వచ్చింది. రిజర్వేషన్ క్రమంలో బుకింగ్‌లు తెరుస్తున్నారు. బుకింగ్ చేసుకున్న వారి ఈ-మెయిల్‌కు మేసేజ్ వస్తుంది. ఓలా యాప్‌లో కూడా వాహనం గురించి సమాచారం ఉంటుంది. కంపెనీ గత నెలలో ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ని 2 వేరియంట్‌లలో ఎస్1, ఎస్1 ప్రో వరుసగా రూ. 99,999, రూ. 1,29,999 వద్ద విడుదల చేసింది. రాష్ట్రాలు ఇచ్చే సబ్సిడీలను బట్టి ధర మారొచ్చు.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్
పూర్తి చేయడానికి 4 స్టెప్స్ః
1) మీరు ఇప్పటికే ముందస్తు బుకింగ్ ధర చెల్లించినట్లయితే మీ ఫోన్ నంబర్‌ను ఉపయోగించి ఓలా ఎలక్ట్రిక్ వైబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వవచ్చు. కొనుగోలు చేయాలనుకుంటున్న వేరియంట్‌ను ఎంచుకోవచ్చు. ఇంకా స్కూటర్‌ని బుక్ చేయకపోతే, రూ. 499 టోకెన్ మొత్తాన్ని కట్టి స్కూటర్‌ని బుక్ చేసుకోవచ్చు. మీరు కొనుగోలు చేయదలిచిన వేరియంట్‌ను ఖరారు చేసిన తర్వాత అందుబాటులో ఉన్న 10 రంగులలో ఒక రంగు స్కూటర్‌ను ఎంచుకోవాలి.
2) తర్వాత చెల్లింపు ట్యాబ్. మీరు ఎంచుకున్న వేరియంట్‌ని బట్టి, మీరు ఇపుడు మీ బ్యాలెన్స్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. స్కూటర్‌కు ఫైనాన్స్ కావాలిస్తే `ఎస్1` స్కూటర్ కోసం నెలవారీ వాయిదా రూ. 2,999 నుండి ప్రారంభమవుతాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లో అధునాతన వెర్షన్ అయిన ఓలా ఎస్1 ప్రో కోసం నెల ఈఎమ్ఐలు రూ. 13,199 నుండి ప్రారంభమవుతాయి.
3) స్కూటర్‌కు ఫైనాన్సింగ్ అవసరమైతే, ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్.. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా క్యాపిటల్‌తో సహా ప్రముఖ బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఓలా, ఓలా ఎలక్ట్రిక్ యాప్‌లలో అర్హత కలిగిన కస్టమర్లకు నిమిషాల్లో ప్రీ-అప్రూవ్డ్ లోన్‌లను అందిస్తుంది. టాటా క్యాపిటల్, ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ డిజిట్ కెవైసీని ప్రాసెస్ చేస్తుంది. అర్హత కలిగిన కస్టమర్లకు తక్షణ రుణాల ఆమోదాన్ని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఒకవేళ మీకు ఫైనాన్సింగ్ అవసరం లేనట్లయితే, ఓలా ఎస్1 కోసం రూ. రూ. 20,000, ఓలా ఎస్1 ప్రో కోసం రూ. రూ. 25,000 అడ్వాన్స్‌గా చెల్లించవచ్చు. మిగిలిన మొత్తాన్ని కంపెనీ మీకు ఇన్వాయిస్ చేసినపుడు చెల్లించొచ్చు.
4) కొనుగోలు ఫార్మాలిటీలు
పూర్తయిన తర్వాత డెలివరీ తేదీ అందించబడుతుంది. అక్టోబర్‌లో ఓలా ఎలక్ట్రిక్
స్కూటర్ల డెలివరీలు ప్రారంభమవుతాయి. స్కూటర్ డెలివరీ ఇంటి వద్దకే చేయబడుతుంది.
ప్రీ బుకింగ్ చేయకపోతే ?
జులైలో ప్రీ బుకింగ్ చేయని వాళ్లు
సైతం ఓలా వెబ్‌సైట్ ద్వారా స్కూటర్‌ను కొనుగోలుకు ప్రయత్నించవచ్చు. ఓలా వెబ్‌సైట్‌కి
వెళ్లి ప్రీ బుకింగ్ టోకెన్ అమౌంట్‌ని చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత
కొనుగులకు సంబంధించిన ఇతర ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓలా ప్రీ బుకింగ్, అడ్వాన్స్‌పేమెంట్‌కి
సంబంధించిన మొత్తం రీఫండబుల్, ఎప్పుడైనా ప్రీ బుకింగ్ లేదా
కొనుగోలు రద్దు చేసుకుంటే డబ్బు వాపస్ ఇస్తారు.
ఇబ్బందులు అధిగమించి
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కి ప్రీ
బుకింగ్స్ జులైలో ప్రారంభమయ్యాయి. మార్కెట్‌లోకి స్కూటర్ రాకముందే లక్షకు పైగా
ప్రీ బుకింగ్స్ సాధించి రికార్డు సృష్టించింది. సెప్టెంబరు 8న
ఈ స్కూటర్ అమ్మకాలు ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. అయితే టెక్నికల్ ఇష్యూస్
తలెత్తడంతో వారం రోజుల పాటు అమ్మకాలు వాయిదా వేశారు. తాజాగా సెప్టెంబరు 15న ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆన్‌లైన్ వేదికగా అమ్మకాలు మొదలయ్యాయి. ఈ
మేరకు ఓలా చీఫ్ భవీష్ అగర్వాల్ ట్వీట్ చేశారు.
Ola
Electric Ties Up with Banks, Financial Institutions for Loans to Customers
Ola
Electric Scooter S1 Launched: Price, Features and Availability Details Here
Ola
S1 Vs Simple One: Electric Scooters Specifications Compared
The revolution is live!
— Ola Electric (@OlaElectric) September 15, 2021
Purchase opens in order of reservation, if you reserved early you're at the front of the line for purchase & delivery! We’ll notify you as soon as your slot opens via email!
Bring home the revolution, buy now! Exclusively on the Ola App! #JoinTheRevolution pic.twitter.com/Cj7jwBz0M7
Bring the revolution home! Ola S1 purchase is rolling out now!l We’re opening it in the order of reservation. Look for your invitation email or check the Ola app to know when it’s live for you! #JoinTheRevolution pic.twitter.com/FQlVDxJ6Ki
— Bhavish Aggarwal (@bhash) September 15, 2021
0 Komentar