Search 'covid vaccine near me' on Google
to check availability – Details Here
Corona Vaccine: ‘గూగుల్
సెర్చ్’తోనూ వ్యాక్సిన్ అపాయింట్‌మెంట్ బుకింగ్
కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉన్న వేళ వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ప్రజలు సులభంగా టీకాలు పొందేలా వ్యాక్సినేషన్ బుకింగ్ విధానంలో ఎప్పటికప్పుడు కొత్త సదుపాయాలు తీసుకొస్తోంది. ఇప్పటికే వాట్సాప్‌లోనూ టీకా స్లాట్‌ను బుక్ చేసుకునే సౌలభ్యం కల్పించగా.. తాజాగా గూగుల్ సెర్చ్‌తోనూ వ్యాక్సిన్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకునేలా వీలు కల్పించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ బుధవారం ట్విటర్ వేదికగా వెల్లడించారు.
‘‘కొవిడ్ టీకాలు సులభంగా లభించేలా మరో ముఖ్యమైన సదుపాయం తీసుకొచ్చాం. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో ‘covid vaccine near me’ అని సెర్చ్ చేయండి. టీకా స్లాట్ల లభ్యత, ఇతర వివరాలు తెలుసుకోంది. అక్కడే ఉన్న ‘Book Appointment’ అని ఫీచర్‌ను ఉపయోగించి స్లాట్ బుక్ చేసుకోండి’’ అని కేంద్రమంత్రి ట్విటర్‌లో పేర్కొన్నారు.
అటు గూగుల్ కూడా ఈ విషయాన్ని
వెల్లడిస్తూ నేడు ఓ ప్రకటన విడుదల చేసింది. సెర్చ్, మ్యాప్, అసిస్టెంట్ ద్వారా.. దేశవ్యాప్తంగా 13వేలకు పైగా
ప్రాంతాల్లో టీకా లభ్యత, అపాయింట్‌మెంట్ల వివరాలను
వినియోగదారులు గూగుల్ నుంచి తెలుసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. కొవిన్ నుంచి
తీసుకున్న రియల్‌టైం డేటా సహకారంతో ఈ సమాచారాన్ని అందిస్తోన్నట్లు తెలిపింది.
ప్రతి కేంద్రంలో అందుబాటులో ఉన్న స్లాట్లు, టీకాలు, డోసులు ఉచితంగా అందిస్తున్నా లేదా వంటి వివరాలను గూగుల్ సెర్చ్‌లో
తెలుసుకోవచ్చని పేర్కొంది. కేవలం ఇంగ్లీష్‌లోనే గాక.. తెలుగు, హిందీ, బెంగాలీ, తమిళ, మలయాళం, కన్నడ, గుజరాతీ,
మరాఠీ ఇలా 8 ప్రాంతీయ భాషల్లోనే ఈ సమాచారం
అందిస్తోన్నట్లు గూగుల్ వెల్లడించింది.
The @MoHFW_INDIA has taken yet another significant initiative to enhance access to #COVID19 vaccine:
— Mansukh Mandaviya (@mansukhmandviya) September 1, 2021
🔎 Search 'covid vaccine near me' on Google
✅ Check availability of slots & more
💉 Use 'Book Appointment' feature to book a slot
📖 More details: https://t.co/zsI9A5fkCp
0 Komentar