Stryder Cycles Launches Two New E-Bikes
స్ట్రైడర్ సైకిల్స్ నుంచి 2 ఇ-బైకులు - ఒకసారి ఛార్జింగ్‌తో 60 కి.మీ
టాటా ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ
స్ట్రైడర్ సైకిల్స్ అర్బన్ కమ్యూటర్ విభాగంలో రెండు కొత్త ఇ-బైకులను విపణిలోకి
విడుదల చేసింది. వోల్టాక్ 1.7, కాంటినో ఈటీబీ-100 మోడళ్లకు ప్రారంభధరగా రూ.29,995ను నిర్ణయించింది.
ఒక్కసారి ఛార్జింగ్‌తో 60 కి.మీ ప్రయాణించొచ్చని తెలిపింది.
ఏఆర్‌ఏఐ నిబంధనలకు లోబడిన
తేలికపాటి బైకు కాంటినో ఈటీబీ-100లో ఏడు స్పీడ్‌లు, 3 రైడ్ మోడ్‌లు (ఎలక్ట్రిక్, హైబ్రిడ్, పెడల్), డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు, కీ లాక్డ్ బ్యాటరీ, ఫ్రంట్ ఎల్‌ఈడీ దీపాలు వంటి
స్మార్ట్ భద్రత ఫీచర్లు ఉన్నాయి. స్ట్రైడర్ వోల్టాక్ 1.7లో
48వీ/260 డబ్ల్యూ మోటార్, మూడు గంటల్లో ఛార్జింగ్ అయ్యే 48వీ లిథియం అయాన్
బ్యాటరీ వంటి ఫీచర్లు ఇచ్చారు.
0 Komentar