'శానిటేషన్ బాధ్యతలు, MDM ఫొటోలు తీసే బాధ్యతల' నుంచి టీచర్లను మినహాయించాలి - ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక
అన్ని యాజమాన్య ప్రభుత్వ
పాఠశాలల్లో శానిటేషన్ బాధ్యతలు, జగనన్న గోరుముద్ద ఫొటోలు తీసే బాధ్యతల
నుంచి టీచర్లను మినహాయించాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక (ఫోర్టో) రాష్ట్ర గౌరవ
అధ్యక్షుడు ఒంటేరు. శ్రీనివాసులు రెడ్డి, చైర్మన్ కరణం
హరికృష్ణ, సెక్రటరీ జనరల్ సామల సింహాచలం శుక్రవారం ఓ
ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.
ఆగస్టు 31వ
తేదీన టీచర్లంతా రోజూ రొటేషన్ పద్ధతిలో టాయిలెట్ల ఫొటోలు, మధ్యాహ్న
భోజన పథకం ఫొటోలు తీసి యాప్లలో అప్లోడ్ చేయాలని ఇచ్చిన మెమో నం.789ను వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. టీచర్ల చేత చదువు
చెప్పించాల్సింది పోయి టాయిలెట్లు, భోజనం ఫొటోలు తీయమనడం
విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకమని, వెంటనే ఆ బాధ్యతల నుంచి
టీచర్లను మినహాయించకపోతే రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపడతామని
తెలియజేశారు.
IMMS
APP, TMF లో వివరాలు పూరించడం HM మరియు అందరి
ఉపాధ్యాయుల బాధ్యత అని నిర్దేశిస్తూ ఉత్తర్వులు
0 Komentar