This e-truck sets Guinness World Record
for covering 1,099 km without recharging
గిన్నిస్ వరల్డ్ రికార్డు
సృష్టించిన స్విట్జర్లాండ్ కొత్త ఎలక్ట్రిక్ ట్రక్ – వివరాలు ఇవే
అన్నీ దేశాల్లో పలు దిగ్గజ
ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిసారించాయి. కొన్ని కంపెనీలు కేవలం
ఎలక్ట్రిక్ కార్లపైనే కాకుండా ఎలక్ట్రిక్ ట్రక్కులను కూడా తయారుచేయాలని
నిర్ణయించుకున్నాయి. ఎలక్ట్రిక్ ట్రక్కులపై దిగ్గజ కంపెనీలు మెర్సిడెజ్ బెంజ్, వోల్వో
వంటి కంపెనీలు దృష్టిసారించాయి. తాజాగా ఎలక్ట్రిక్ వాహన రంగంలో యూరప్‌కు చెందిన
ఫ్యూచరికం కంపెనీ సంచలనాన్ని నమోదు చేసింది. ఒక్కసారి ఛార్జింగ్‌తో ఏకంగా 1,099కి.మీ మేర ప్రయాణించి గిన్నిస్ వరల్డ్ రికార్డును నమోదుచేసింది.
డిపీడీ స్విట్జర్లాండ్, కాంటినెంటల్
టైర్స్ భాగస్వామ్యంతో వోల్వో ట్రక్ యూనిట్‌ను మాడిఫై చేసి ఫ్యూచరికం ట్రక్‌ను
డెవలప్ చేసింది. కంపెనీ నిర్వహించిన రేంజ్ టెస్ట్‌లో సుమారు ఇద్దరు డ్రైవర్లు
పాల్గొన్నారు. ఓవల్ టెస్ట్ ట్రాక్ మీద ట్రక్ సుమారు 23
గంటల్లో 392 ల్యాప్‌లను పూర్తి చేసినట్లు కంపెనీ
వెల్లడించింది. ట్రక్ సరాసరి గంటకు 50కిలోమీటర్ల వేగంతో
ప్రయాణించింది.
PICTURE OF THE WEEK - Futuricum, DPD Switzerland & Continental set new electric truck distance Guinness World Record https://t.co/tfTPLLuCk2 via @https://twitter.com/fleettransport #futruricum @DPDgroup_news @dpdparcelwizard @dpdireland @ContiUK @continentaltire @HandlingNetwork
— Fleet Transport (@fleettransport) September 9, 2021
డీపీడీ స్విట్జర్లాండ్ స్ట్రాటజీ
అండ్ ఇన్నోవేషన్ డైరక్టర్ మార్క్ ఫ్రాంక్ మాట్లాడుతూ..ఎలక్ట్రిక్ మొబిలిటీ
రంగంలో ఇదొక సంచలన విజయమని పేర్కొన్నారు. ఫ్యూచరికం కంపెనీ ఎలక్ట్రిక్ ట్రక్‌లో
సుమారు 680కేడబ్య్లూహెచ్
బ్యాటరీను ఉపయోగించినట్లు కంపెనీ పేర్కొంది. ట్రక్ పూర్తి బరువు 19
టన్నులు. 680కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో సుమారు 680హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేయనుంది.
0 Komentar