Tamil Nadu Government to Bear Cost of
Government School Students in Professional Education
ప్రభుత్వ పాఠశాలల నుండి ప్రొఫెషనల్
కోర్సుల్లో చేరే విద్యార్థుల ఖర్చులను భరించనున్న ప్రభుత్వం
ప్రొఫెషనల్ కోర్సుల్లో 7.5 శాతం కోటా కింద రాష్ట్రంలో ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరే విద్యార్థుల
ట్యూషన్ ఫీజులను తమిళనాడు ప్రభుత్వం భరిస్తుందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్
తెలిపారు.
* ప్రభుత్వ, ఎయిడెడ్,
ప్రైవేట్ సంస్థలలో అందించే ఇంజినీరింగ్, అగ్రికల్చర్,
వెటర్నరీ, లా, ఇతర
ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు అడ్మిషన్ల
కోసం తమిళనాడు ప్రభుత్వం గత నెలలో - 7.5 శాతం రిజర్వేషన్లను
"ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన" కేటాయించింది.
* 50 మంది ఇంజినీరింగ్
అభ్యర్థులకు ప్రవేశ ఉత్తర్వులను అందజేసిన స్టాలిన్, ప్రస్తుత
విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్ కోర్సుల కోసం 10 వేల మంది
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రిజర్వేషన్ల నుంచి ప్రయోజనం పొందుతారని, 350
మంది వ్యవసాయం, పశువైద్యం, మత్స్యసంపద, న్యాయ కోర్సుల్లో ప్రవేశిస్తారని
చెప్పారు.
* "7.5 శాతం కోటా ద్వారా
ప్రొఫెషనల్ కాలేజీల్లో ప్రవేశించే ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు ట్యూషన్ ఫీజులు,
హాస్టల్ ఫీజులు, కౌన్సెలింగ్ ఫీజులను కూడా
భరించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది" అని ముఖ్యమంత్రి చెప్పారు.
* ప్రభుత్వ పాఠశాలల్లో, ముఖ్యంగా
గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే
ప్రయత్నంలో భాగంగా రిజర్వేషన్ ఉందని స్టాలిన్ తెలిపారు. అటువంటి పాఠశాలల్లో 6
నుంచి 8 వ తరగతి వరకు చదివిన విద్యార్థులు
కొత్త కోటా ద్వారా ప్రయోజనం పొందుతారని ఆయన చెప్పారు.
வாய்ப்புகளை உருவாக்கினால் திறமைகள் தன்னாலே சுடர்விடும்!
— M.K.Stalin (@mkstalin) September 20, 2021
அரசுப் பள்ளி மாணாக்கர்களுக்கு 7.5% முன்னுரிமை ஒதுக்கீட்டுச் சேர்க்கை ஆணைகளை வழங்கி, அவர்களின் கல்வி - விடுதி - கலந்தாய்வுக் கட்டணங்களை அரசே ஏற்கும் என அறிவித்தேன்.
கல்வி கற்க இனித் தடையேதும் கூடாதென எண்ணித் துணிவோம்! pic.twitter.com/9n5AIrVV1o
0 Komentar