TS BIE: Intermediate Academic Year Calendar
Released
తెలంగాణలో ఇంటర్ విద్యా సంవత్సరం
ఖరారు
- పరీక్షల విధానంలో కీలక మార్పులు
తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఆన్‌లైన్ తరగతులతో కలిపి 220 పని దినాలతో విద్యా సంవత్సరాన్ని ఖరారు చేసింది. దసరాకు ఆదివారంతో కలిపి 5 రోజులు, సంక్రాంతికి జనవరి 13 నుంచి 15 వరకు సెలువులు ప్రకటించింది. ఇంటర్ పరీక్షల నిర్వహణ విధానంలోనూ రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. అర్ధ సంవత్సర, ప్రి ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.
ముఖ్యమైన తేదీలు..
* డిసెంబర్ 13 నుంచి 18 వరకు అర్ధ సంవత్సర పరీక్షలు.
* ఫిబ్రవరి 10 నుంచి 18 వరకు ప్రి ఫైనల్ పరీక్షలు.
* ఫిబ్రవరి 23 నుంచి మార్చి 15 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్.
* మార్చి 23 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు.
* మే చివరి వారంలో
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు.
* ఏప్రిల్ 14 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు.
* జూన్ 1న ఇంటర్ కళాశాలలు పునఃప్రారంభం.
ACADEMIC CALENDAR FOR 2021-22 👇
0 Komentar