TS Direct Recruitment 2021: Apply for 172 Junior Panchayat Secretaries Posts
టిఎస్: 172 జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం – వివరాలు ఇవే
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన
హైదరాబాద్ లోని పంచాయతీ రాజ్, గ్రామీణ ఉపాధి కమీషనర్ కార్యాలయం
స్పోర్ట్స్ కోటా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది.
జూనియర్ పంచాయతీ సెక్రటరీలు
మొత్తం ఖాళీలు: 172
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు
కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. స్పోర్ట్స్ కోటాలో అర్హత సాధించి ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు,
ఎక్స్ సర్వీస్ మెన్ కి మూడేళ్లు, వీహెచ్ అభ్యర్థులకు
పదేళ్లు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఐదేళ్లు
గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు: నెలకి రూ.28719 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్షతో పాటు
క్రీడలకి సంబంధించిన సర్టిఫికెట్ల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షని మొత్తం
200 మార్కులకి నిర్వహిస్తారు. దీనిలో రెండు పేపర్లు ఉంటాయి.
పేపర్ 1లో
జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, కల్చర్
అండ్ తెలంగాణ చరిత్ర విభాగాల నుంచి 100 మార్కులు ఉంటాయి.
పేపర్ 2లో
తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018, రూరల్ డెవలప్ మెంట్
ప్రోగ్రాములు, భారత ప్రభుత్వం, తెలంగాణ
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రభుత్వ పథకాల నుంచి 100 మార్కులు
ఉంటాయి.
దీనికి నెగిటివ్ మార్కింగ్
ఉంటుంది. ప్రతి పేపర్ లో కనీస అర్హతగా 35 మార్కులు సాధించాల్సి
ఉంటుంది. ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మాధ్యమాల్లో ఉంటుంది.
ఖాళీల వివరాలు:
1). ఆదిలాబాద్ - 6
2). భద్రాద్రి కొత్తగూడెం -
7
3). జగిత్యాల - 5
4). జనగాన్ - 4
5). జయశంకర్ భూపాలపల్లి
మరియు ములుగు - 6
6). జోగులాంబ గద్వాల్ - 3
7). కామారెడ్డి - 8
8). కరీంనగర్ - 4
9). ఖమ్మం - 9
10). కుమరంభీం ఆసిఫాబాద్ - 4
11). మహబూబాబాద్ - 7
12). మహబూబ్ నగర్ మరియు
నారాయణపేట - 10
13). మంచిర్యాల్ - 4
14). మెదక్ - 6
15). మేడ్చల్ మల్కాజిగిరి -
0
16). నాగర్ కర్నూల్ - 6
17). నల్గొండ - 13
18). నిర్మల్ - 6
19). నిజామాబాద్ - 8
20). పెద్దపల్లి - 3
21). రాజన్న సిరిసిల్ల - 3
22). రంగారెడ్డి - 7
23). సంగారెడ్డి - 8
24). సిద్దిపేట - 6
25). సూర్యాపేట - 6
26). వికారాబాద్ - 8
27). వనపర్తి - 3
28). వరంగల్ రూరల్ - 5
29). వరంగల్ అర్బన్ - 1
30). యాదాద్రి భువనగిరి - 6
పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, నిజామాబాద్,
కరీంనగర్, వరంగల్, నల్గొండ,
మహబూబ్ నగర్.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, బీసీ
(క్రీమీ లేయర్ కిందకి వచ్చే) అభ్యర్థులు రూ.800, ఎస్సీ/
ఎస్టీ/ పీహెచ్
అభ్యర్ధులు రూ. 400 చెల్లించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
18-09-2021
దరఖాస్తులకి చివరి తేదీ: 08-10-2021
0 Komentar